హిందూ సాంప్రదాయాలు నమ్మకాల ప్రకారం ప్రతి పనిలోనూ కొన్ని నియమాలు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. కాబట్టి స్నానం చేసేటప్పుడు కూడా కొన్ని నియమ నిబంధనలు పాటించాలని శాస్త్రం చెబుతోంది. కొంత మంది తరచూ తలస్నానం చేస్తూ ఉంటారు. కానీ అలా తరచూ తలస్నానం చేయకూడదు అంతే కాకుండా పురుషులు మహిళలు కూడా ఏ సందర్భాల్లో తలస్నానం చేస్తే మంచిదో శాస్త్రం చెప్పింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. సోమవారం రోజు తలస్నానం చేస్తే నిత్య సౌభాగ్యంతో ఉంటారని శాస్త్రం చెబుతోంది. అయితే కొందరు స్త్రీలు శుక్రవారం కూడా తల స్నానం చేస్తారు.
కానీ శుక్రవారం మంగళవారం తలస్నానం చేయకూడదట. అదే విధంగా మహిళలు బుధవారం తలస్నానం చేస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత మరింత పెరుగుతుందట. మహిళలు శనివారం తలస్నానం చేసినట్లయితే వారికి ఐశ్వర్యం మరింత కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. అదేవిధంగా పురుషులు తలస్నానం చేస్తే మంచిదట. వారి అందం మరింత పెరిగే అవకాశం కూడా ఉందట ఆరోగ్యవంతులుగా సుఖ సంతోషాలతో ఉంటారని కూడా శాస్త్రం చెబుతోంది. పురుషులు మంగళవారం తలస్నానం చేసినట్లయితే విపరీతమైన దుక్కానికి కారణమవుతుందని శాస్త్రం చెబుతోంది. పురుషులు కూడా బుధవారం తలస్నానం చేసినట్లయితే లక్ష్మి దీవెనలు కలిగి ఆర్థికంగా స్థిరపడతారని చెబుతోంది.
కొంతమంది గురువారం తలస్నానం చేస్తూ ఉంటారు. కానీ గురువారం తలస్నానం చేసినట్లయితే ఆర్థిక కష్టాలు …అప్పులు చుట్టుముడతాయట. అదే విధంగా కొంతమంది ఆదివారం తలస్నానం చేస్తూ ఉంటారు. అలా ఆదివారం తలస్నానం చేస్తే తాపం మరియు కోరికలు పెరుగుతాయని శాస్త్రం చెబుతోంది. కానీ శనివారం పురుషులు స్నానం చేస్తే మహా భోగం కలుగుతుందని కూడా శాస్త్రం చెబుతోంది. అయితే మిగతా రోజులలో తప్పని పరిస్థితి అయితేనే తలంటు స్నానం చేయాలి.