ఒకప్పుడు వంట కనీసం ఒక పూటంతా పట్టేది. మహిళలకు వంట చేయడం కష్టతరంగానే ఉండేది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్టవ్ లు, ప్రెజర్ కుక్కర్లు వచ్చిన తరువాత వంట పని కొంచం సులువు అయ్యిందనే చెప్పొచ్చు. ఇటీవల ఎవరి ఇంట్లో చూసినా ప్రెజర్ కుక్కర్లు లేని వంట గది ఉండడం లేదు. అయితే కొన్ని ఆహార పదార్ధాలను ప్రెజర్ కుక్కర్ లో వండడం వలన వాటి రుచి పూర్తిగా తగ్గిపోతుంది.
Advertisement
టైం సేవ్ చేయవచ్చు అన్న ఉద్దేశ్యంతో ఆడవారు ఎక్కువగా వంటలను అందులోనే చేస్తుంటారు. కానీ, కుక్కర్ లో వండడం వలన ఆహార పదార్ధాలు వాటి రుచిని కోల్పోతాయి. ముఖ్యంగా చాలా మంది అన్నాన్ని కుక్కర్ లోనే వండుతారు. అన్నాన్ని కుక్కర్ లో వండడం వలన బియ్యం లోని పిండిపదార్ధం అక్రిలమైడ్ అనే హానికరమైన రసాయాన్ని రిలీజ్ చేస్తుంది. ఇది శరీరంలోని అనేక అనారోగ్యాలకు కారణం అవుతుంది. వీలైనంత వరకు అన్నం కుక్కర్లో వండకుండా విడిగా వండడం మంచిది.
Advertisement
అలాగే బంగాళాదుంపలు, పాస్తా కూడా కుక్కర్లో ఉడికించకూడదు. బంగాళా దుంపలో కూడా పిండిపదార్ధాలు ఉంటాయి. పాస్తాలో ఉండే అధిక సాచురేటెడ్ కంటెంట్ హానికరమైన రసాయనాలను విడుదల చేస్తుంది. పాలు, జున్ను లాంటివి కుక్కర్లో వండడం వలన అవి విరిగిపోతాయి. ఇలాంటి వాటిని తినడం వలన మన ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఇక చేపలు కూడా ప్రెజర్ కుక్కర్ లో వండడం మంచిది కాదు. అలా వండితే, వాటిల్లో ఉన్న ఫైబర్ కంటెంట్ పూర్తిగా పోతుంది. అలాంటి ఆహరం తినడం వలన అనారోగ్యం తప్ప ఏమీ మిగలదు.
మరిన్ని ముఖ్య వార్తలు:
వీటిని మాత్రం ప్రిడ్జ్ లో అస్సలు పెట్టకండి.. విషం కంటే ప్రమాదం..!
ఈ ఆహారాలతో జుట్టు సమస్యలకు సులభంగా చెక్ పెట్టొచ్చు..!