Home » ఇలాంటి ప్రదేశాల్లో పొరపాటున కూడా ఇల్లు కట్టకండి.. అస్సలు ప్రశాంతత ఉండదు!

ఇలాంటి ప్రదేశాల్లో పొరపాటున కూడా ఇల్లు కట్టకండి.. అస్సలు ప్రశాంతత ఉండదు!

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

గృహమే కదా స్వర్గ సీమ అని అంటూ ఉంటారు. మనం నివసించే ఇంటి కోసం మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. మన ఇల్లు చక్కగా ఉంటేనే మన జీవితం బాగుంటుంది. మానసిక ప్రశాంతత మనకి ఇంట్లోనే దొరుకుతుంది. అయితే మన ఇంట్లో ప్రశాంతత దొరకాలి అంటే.. మన ఇంటిని కొన్ని ప్రదేశాల్లో కట్టుకోకూడదు అని చాణుక్యుడు చెబుతున్నాడు. ఇంతకీ ఇంటిని ఎటువంటి ప్రదేశాల్లో కట్టుకోకూడదు అనే విషయాలను ఈ ఆర్టికల్ చూసి తెలుసుకోండి.

chanakya new

Advertisement

మీకు గౌరవం ఇవ్వని వ్యక్తులు ఉన్న చోట ఇంటిని ఏర్పాటు చేసుకోకండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా మీకు ఉన్న విలువలను చూసే స్పందిస్తారు. మీకు గౌరవం ఇవ్వడం ఎవరికీ కనిపించకపోతే.. మీ చుట్టూ ఉన్న వారు కూడా గౌరవం ఇవ్వరు. అలాగే.. జీవితంలో మీరు ముందుకు వెళ్లాలంటే మీకు ఉపాధి అవసరం. స్థలం ఎంత సౌకర్యవంతంగా ఉన్నా, అందంగా ఉన్నా మీకు గౌరవం, ఉపాధి అవకాశాలు లేకపోతే అక్కడ ఉండడం వ్యర్థం.

Advertisement

అలాగే మీకు జీవితంలో తోడు ఉండడానికి స్నేహితులు, బంధువులు కచ్చితంగా ఉండాలి. అందుకే వారు దగ్గరలో ఉన్న చోటులో ఇంటిని ఏర్పాటు చేసుకోండి. దగ్గరి బంధువులు, సన్నిహితులు ఉంటె కష్ట సమయాల్లో మిమ్మల్ని ఆదుకుంటారు. అలాగే.. మీరు కూడా చేదోడు వాదోడుగా ఉండండి. మీరు ఉంటున్న చోటుకి దగ్గరలో ఓ విద్య సంస్థ కూడా ఉండేలా చూసుకోండి. విద్య ద్వారా మాత్రమే అభివృద్ధి ఉంటుంది. మీ పిల్లలకు ఆస్తులని ఇచ్చినా లేకున్నా.. విద్యని ఇవ్వడం కనీస కర్తవ్యమ్. అలాగే.. మీరు ఏదైనా కొత్త అంశాన్ని నేర్చుకునే విధంగా అవకాశాలు ఉండే స్థలాన్ని ఎంచుకోవాలి. జీవితంలో పైకి రావడం చాలా ముఖ్యం. అందుకు అనువైన ప్రదేశాన్ని మాత్రమే నివాస స్థలంగా ఎంచుకోవాలి. కాబట్టి ఇంటిని కట్టుకునే ముందు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోండి.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading