Home » వైర‌ల్‌: వ‌ధూవ‌రుల డ్యాన్స్… మ‌ధ్య‌లో స్టేజ్‌పైకెక్కిన కుక్క, ఏం చేసిందంటే…?

వైర‌ల్‌: వ‌ధూవ‌రుల డ్యాన్స్… మ‌ధ్య‌లో స్టేజ్‌పైకెక్కిన కుక్క, ఏం చేసిందంటే…?

by Bunty
Ad

మనిషి జీవితంలో వివాహం అనేది అత్యంత కీలక ఘట్టం. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగిన రెండు మనసులను ఏకం చేస్తుంది పెళ్లి. ఎవరి స్థాయిని బట్టి వారు అంతే ఘనంగా పెళ్లి చేసుకున్నారు. బంధుమిత్రుల సమక్షంలో కన్నుల పండుగగా పెళ్లి జరుపుకోవడం భారతీయులకు ఆనవాయితీగా వస్తోంది. మారుతోన్న కాలమాన పరిస్ధితులకు అనుగుణంగా మెహందీ ఫంక్షన్, సంగీత్ ఇలా కొత్త కొత్త ఘట్టాలు భారతీయ వివాహా వ్యవస్థలో చేరుతున్నాయి.
Dog disturbs first wedding dance viral video

ఇక విదేశాల్లో అయితే పెండ్లి వేడుక సందర్భంగా ఖచ్చితంగా వధువు, వరుడు డ్యాన్స్ చేయడం మనకు తెలిసిందే. ఇప్పుడు ఇండియాలోనూపెళ్లైన కొత్త జంట డ్యాన్స్ చేయ‌డం షరా మామూలే అయ్యింది. ఇలానే ఓ దేశంలో కొత్త జంట వివాహం చేసుకున్నాక స‌ర‌దాగా స్టెప్పులు వేయ‌డం మొద‌లుపెట్టింది. అలా స్టెప్స్ వేస్తున్న స‌మ‌యంలో అనుకోకుండా ఓ అతిథి వారి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింది.

Advertisement

Advertisement

వ‌రుడు రెండు కాళ్ల మ‌ధ్య‌లోకి దూరి అక్క‌డి నుంచి ఇద్దరి మ‌ధ్య‌లోకి వ‌చ్చి నిల‌బ‌డింది. మీరు చేస్తున్న డ్యాన్స్ న‌చ్చ‌డం లేదబ్బా అన్న‌ట్టుగా ఫేస్ పెట్టి అలాగే కూర్చుండిపోయింది. పాపం ఆ అతిథి ఇబ్బందిని గ‌మ‌నించి వ‌ధూవ‌రులు న‌వ్వుకున్నారు. ఇంత‌కీ అ అతిథి ఎవ‌రు అంటే వారి పెంపుడు కుక్క‌. ఈ వీడియోను ప్రపోజల్స్ అండ్ వెడ్డింగ్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయగా.. వైరల్ అయ్యింది. ఇది చూసిన వారు భారీగా లైకులు, కామెంట్స్ చేస్తూ తమ స్పందనను తెలియజేస్తున్నారు.

https://www.instagram.com/reel/CXGapZWI_7m/?utm_source=ig_embed&ig_rid=df27232d-84ab-43f7-bb8d-9afe6599094e

Visitors Are Also Reading