తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటుడు చలపతిరావు కు కొన్ని ప్రత్యేకమైన పేజీలు ఉన్నాయి. ఆయన తన విలక్షణమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఎన్నో సినిమాల్లో నటించి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సినిమాలే కాదు నిజజీవితంలో కూడా ఎలాంటి మచ్చ లేని మనిషి.. ఇండస్ట్రీలో ప్రతి ఒక్క నటుడితో చాలా ఆప్యాయంగా ప్రేమగా మాట్లాడే గొప్ప వ్యక్తి చలపతిరావు. ఇండస్ట్రీలో చాలామంది చలపతిరావును బాబాయ్ అంటూ ప్రేమగా పిలుస్తారంటే ఆయనకు ఇండస్ట్రీతో ఎలాంటి రిలేషన్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
Advertisement
also read;పవన్ కళ్యాణ్, చిరంజీవిలది ముఖ్యమంత్రి స్థాయి : కమెడియన్ పృథ్వీ రాజ్
చలపతి రావు ఇందుమతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అలా ముగ్గురు పిల్లలు పుట్టాక అగ్ని ప్రమాదంలో ఆయన భార్య మరణించింది. అయినా చలపతిరావు బాధను దిగ మింగుకొని తన పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడుతూ వచ్చాడు. కుటుంబ సభ్యులంతా కలిసి మరో పెళ్లి చేసుకోమని అడిగినా ఆయన ఏనాడు కూడా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. దీనికి ప్రధాన కారణం పిల్లల భవిష్యత్తు. ఆ విధంగా చలపతిరావుకి ఆడాల్లంటే ద్వేషం అనే విధంగా తయారయ్యాడు. ఒకసారి ఓ చిత్రం ఆడియో ఫంక్షన్ లో ఆడవారు అంటే పక్క*కి మాత్రమే పనికి వస్తారు అంటూ మాట్లాడారు.
Advertisement
ఇలా మహిళల గురించి చీప్ గా మాట్లాడి ఇండస్ట్రీలో బుక్ అయ్యాడు చలపతిరావు. ఈ విధంగా ఎలాంటి కల్మషం లేని వ్యక్తి తొందరపడి ఈ మాట అనేశాడు.దీంతో అప్పట్లో మహిళా సంఘాలన్నీ అట్టుడికి పోయాయి. చివరికి చలపతిరావు తప్పయింది అంటూ క్షమాపణ కూడా చెప్పాడు. చలపతిరావు జీవితంలో మిస్టేక్ లో అన్న ఈ మాట తప్ప ఎలాంటి తప్పులు చేసిన దాఖలాలు అయితే లేవు. ఈ విధంగా జీవితమంతా నటన,షూటింగ్, పిల్లల కెరియర్ అంటూ తన చివరి రోజుల వరకు పెళ్లి చేసుకోకుండా ఆడవారికి దూరంగా ఉన్న మహానుభావుడు చలపతిరావు ఇండస్ట్రీకి దూరమవ్వడం బాధాకరం.
also read;పవన్ సత్యాగ్రహి సినిమా ఎందుకు ఆగిపోయింది..ఇంతకాలానికి తెలిసిన అసలు నిజం ఇదే…!