Home » ఆషాడ మాసంలో నవ దంపతులను ఎందుకు దూరం పెడతారో తెలుసా..?

ఆషాడ మాసంలో నవ దంపతులను ఎందుకు దూరం పెడతారో తెలుసా..?

by Mounika
Ad

మన తెలుగు సంవత్సరాలలో ప్రతి మాసానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి మాసాలలో ఆషాడ మాసం కూడా ఒకటి. ఈ ఆషాడ మాసం వచ్చిందంటే కొత్తగా పెళ్లయిన దంపతులు మాత్రం తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తారు. ఈ ఆషాడం పేరుతో కొత్తగా పెళ్లయిన మమ్మల్ని దూరం చేస్తున్నారంటూ తెగ బాధపడిపోతూ ఉంటారు. వివాహమైన తర్వాత వచ్చిన తొలి ఆషాడంలో కొత్తగా అత్తారింటికి వచ్చే కోడలు, అత్త ఒకేచోట ఉండకూడదని, ఒకరికొకరు ఎదురు పడకూడదని చెబుతారు. కానీ ఇలాంటి ఆచారం ఎందుకు చేస్తారో తెలుసా?

Advertisement

మన పూర్వీకులు ఎలాంటి ఆచారాలు పెట్టినా ముందు తరం వారికి మంచి జరగాలని చేస్తారు. ఆషాఢ మాసంలో కొత్త కోడలిని పుట్టింటికి పంపడానికి, కొత్త దంపతులను దూరం చేయడానికి అనేక కారణాలు ఉంటాయి. కొన్ని శాస్త్రాలకు సంబంధించినవి అయితే మరికొన్ని అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఏర్పాటు చేసినవి. మన హిందూ ఆచార ప్రకారం జ్యేష్ఠ మాసంలో ఎక్కువగా వివాహాలు జరుగుతాయి. ఆషాఢ మాసం వర్షఋతువుకు అనువైన కాలం.

Advertisement

ఆ సమయంలోలోనే వ్యవసాయ పొలాలలో దుక్కి దున్ని నాట్లు వేస్తారు. ఈ కాలంలో రైతులు పొలం పనులతో క్షణం తీరిక లేకుండా ఉంటారు. అప్పట్లో ఎక్కువ శాతం మంది వ్యవసాయంపైన ఆధారపడి జీవనం సాగించేవారు. కాబట్టి.. ఇంట్లో వాళ్ళు పొలం పనులకు వెళ్ళాక.. పెళ్లయిన కొత్త దంపతులు ఏకాంతంగా గడిపేందుకు ఇష్టపడతారు. పరిస్థితి ఇలానే ఉంటే కొత్త పెళ్లికొడుకు వ్యవసాయాన్ని వదిలేసి భార్య చుట్టూ తిరుగుతాడని భావించి భార్యను పుట్టింటికి పంపిస్తారు.

BORN BABY

BORN BABY

అదేవిధంగా అల్లుడిని కూడా అత్తారింటికి వెళ్లకుండా జాగ్రత్త పడేవారు.అప్పుడు ఎటువంటి ఆటంకం లేకుండా పొలం పనులపై దృష్టి పెడతారని. అంతేకాకుండా ఈ ఆషాడ మాసంలో భార్యాభర్తలు సంసారం చేయడం వల్ల మండు వేసవిలో పిల్లలు పుడతారని, ఆ ఎండ తాపానికి నవజాత శిశువులు తట్టుకోలేరని మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ఆచరణలో పెట్టారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

భార్య ప్రెగ్నెన్సీ సమయంలో భర్త చేయాల్సిన పనులు…ఆ పని తప్పా!

ఈ 4 లక్షణాలు కనుక భార్యలో ఉంటే.. భర్త పరాయి ఆడదాని స్వాధీనమైనట్లే..!

మీ భార్య గొడవ పడితే ఇలా కూల్ చేయండి !

Visitors Are Also Reading