పూర్వకాలంలో అయితే తొందర తొందరగా పెళ్లి చేసుకునేవారు వెంట వెంటనే పిల్లల్ని కూడా కనేవారు.. కానీ ప్రస్తుత జనరేషన్లో పెళ్లి చేసుకోవడం నుంచి మొదలు పిల్లల్ని కనే వరకు దానికంటూ ఒక ప్రత్యేకమైన సమయాన్ని పెట్టుకుంటున్నారు. ఆ ప్లాన్ ప్రకారమే అన్ని పనులు చేస్తున్నారు.. చాలామంది పెళ్లి తర్వాత పిల్లలను కనడంలో కాస్త ఆలోచిస్తున్నారు.. కానీ ఏ వయసులో జరగాల్సిన తంతు ఆ వయసులో జరగాలని పెద్దలంటుంటారు. పెళ్లి నుంచి మొదలు పిల్లల వరకు అన్ని ఓ ప్లాన్ ప్రకారమే వెళ్తున్నారు ఇప్పటి జనరేషన్ భార్యాభర్తలు. అలా పిల్లలకు ప్లాన్ చేసుకొని , తర్వాత పిల్లల్ని ఏ సమయంలో కనాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
also read:పెదరాయుడు సినిమా హిట్ కి సాయి కుమార్ కి ఉన్న సంబంధం ఏంటో తెలుసా ?
Advertisement
ప్రస్తుత కాలంలో పిల్లల పెంపకం అనేది ఒక టాస్క్.. వారికి చిన్న వస్తువు నుండి ఆట బొమ్మల వరకు పెరిగిన కొలది వారి అవసరాలను బట్టి మనకు కూడా భారం పెరిగిపోతూ ఉంటుంది. అలా పిల్లలను కనగానే వారికి కావాల్సినవన్నీ మనం అరేంజ్ చేసే శక్తి ఉంటేనే పిల్లలు హ్యాపీగా ఉంటారని అంటున్నారు. కాబట్టి పిల్లల్ని పెంచే అంత ఆర్థిక స్తోమత నీకు లేకుంటే అది వచ్చేవరకు పిల్లల్ని కనకపోవడమే మంచిది అంటున్నారు ఆర్థిక నిపుణులు. అలా పిల్లలను ప్లాన్ చేసుకునే వారికి కొన్ని సూచనలు కూడా ఇస్తున్నారు. ఒకవేళ మీకు ఆర్థికంగా బాగో లేకపోతే పిల్లల్ని కనలేము అని అనిపిస్తే మాత్రం చాలా సమయం వెయిట్ చేయకండి.
అలా చేయడం వల్ల పిల్లల్ని కనే సామర్థ్యం కూడా తగ్గిపోవచ్చు. ఒకవేళ పిల్లల్ని కనకుండా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే మీకున్న సంతాన సామర్థ్యాన్ని టెస్ట్ చేయించుకున్న తర్వాతే ఇలాంటి ప్లాన్ చేసుకోవాలని అంటున్నారు. సాధారణంగా పిల్లల్ని పెంచడం మామూలు విషయమైతే కాదు. ఉమ్మడి కుటుంబాల్లో అయితే ఇది తెలియకుండానే జరిగిపోతుంది. కానీ ఒక భార్య భర్త మాత్రమే ఉంటే పిల్లల్ని పెంచడం ఒక ఛాలెంజ్ అని చెప్పవచ్చు. పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది.ఇద్దరు దానికి రెడీగా ఉన్నప్పుడే పిల్లల్ని కనాలని నిపుణులు తెలియజేస్తున్నారు.
also read: