ప్రస్తుతం ఎండలు ఎడతెరిపి లేకుండా కొడుతున్నాయి. పని మీద బయటకి వెళ్లి, ఉక్కపోతతో ఇంట్లోకి వచ్చి ఏసీ ఆన్ చేసుకుని చక్కగా పడుకుందాం అనుకుంటారు. అలాంటి వారు ఏసీ గురించి ఈ విషయాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే..!! పూర్వకాలంలో ఎక్కువగా గుడిసెలు, పెంకుటిల్లు ఉండేవి. చెట్లు కూడా అనేకం ఉండటంవల్ల, చల్లని గాలులు వీస్తూ హాయిగా ఉండేది. ప్రస్తుతం టెక్నాలజీ పెరిగింది. మెడల మీద మెడలు పెరిగిపోయాయి. చెట్టు నరికి వేసి బిల్డింగులు కట్టుకొని చల్లని గాలి కోసం ఏసీలు బిగించుకొని దాని కింద సేద తీరుతున్నారు.
Advertisement
ఇప్పుడు ఏ ఆఫీస్ చూసినా ఏ ఇంట్లో చూసినా ఏసీ తప్పనిసరి అయిపోయింది. కానీ ఎయిర్ కండిషనర్ తో ఆరోగ్యం పాడవుతుంది. అది మీకు తెలుసా.. ఏసీల గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. మరి ఇందులో నిజమెంతో అబద్ధమెంతో తెలుసుకుందామా..? ఒకప్పుడు ఏసీ అనేది సంపన్న కుటుంబాల ఇంట్లోనే ఉండేది. కానీ ఇప్పుడు దీని ధర చౌక అయిపోవడంతో చాలామంది ఇళ్లలో కూడా ఏసీలు బిగించుకుంటున్నారు. ఏసీ లేకుండా ఒక్క క్షణం కూడా గడపలేక పోతున్నారు. ఎప్పుడు ఏసి గదిలో ఉండే వారికి కళ్ళు పొడిబారు తున్నాయట.
Advertisement
కళ్ళు శ్రమించే ద్రవాల పరిమాణం తగ్గి, కళ్ళు పొడిబారుతున్నాయట. అలాగే గంటల కొద్దీ ఏసీలో ఉండే వారికి చర్మవ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందట. గదుల్లో తేమ శాతం తక్కువగా ఉండటం వల్ల డీహైడ్రేషన్ సమస్య కూడా వస్తుందని అంటున్నారు కొంతమంది. అలాగే ఫుల్ టైమ్ ఏసీలో ఉండటంవల్ల శ్వాసకోస సంబంధించిన వ్యాధులు కూడా వస్తున్నాయని అంటున్నారు. ఏసీ నుంచి వచ్చే గాలిని పీల్చడం వల్ల ముక్కు గొంతు ఇన్ఫెక్షన్ గురవుతున్నారట. ఆస్తమా ఎలర్జీ ఉన్నవారు ఏసీకి దూరంగా ఉంటేనే మంచిదని అంటున్నారు. కాబట్టి ఏసీ రూముల్లో పని చేసేవారికి ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించాలని అంటున్నారు.
ఇవి కూడా చదవండి :
ఇంజనీర్స్ బిర్యానీ మీరు ఎప్పుడైనా తిన్నారా.. ఓ లుక్కేయండి..!!
“నువ్వునాకు నచ్చావ్” లాంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న అన్ లక్కీ హీరో ఎవరో తెలుసా…!
చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయిన 10 మంది సినీతారలు….వారి మృతికి కారణాలు….!