Home » “నువ్వునాకు న‌చ్చావ్” లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా…!

“నువ్వునాకు న‌చ్చావ్” లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా…!

by AJAY
Ad

విక్ట‌రీ వెంక‌టేశ్ కెరీర్ లోని బెస్ట్ సినిమాల‌లో నువ్వు నాకు న‌చ్చావ్ సినిమా కూడా ఒక‌టి. ల‌వ్ అండ్ కామెడీ ఎంట‌ర్టైన‌ర్ గా ఈ సినిమా తెర‌కెక్కింది. విజ‌య‌భాస్క‌ర్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. చంద్ర‌మోహ‌స్, ప్ర‌కాష్ రాజ్, బ్ర‌హ్మానందం లాంటి న‌టులు ఈ సినిమాలో ముఖ్య పాత్ర‌లు చేశారు. ఈ సినిమాలో ఆర్తీ అగ‌ర్వాల్ వెంక‌టేష్ కు జోడీగా న‌టించింది. ప‌ని పాటా లేకుండా ఊర్లో జులాయిగా తిరుగుతున్న త‌న కుమారుడిని గాడిలో పెట్టేందుకు త‌న స్నేహితుడి వ‌ద్ద‌కు పంపించడం.

Advertisement

అలా తండ్రి స్నేహితుడి వ‌ద్ద‌కు వెళ్లిన వెంక‌టేష్ అత‌డి కూతురుతో ప్రేమ‌లో ప‌డ‌టం. ఆ త‌ర‌వాత త‌న తండ్రి మ‌రియు అతడి స్నేహాన్ని చెడగొట్ట‌కూడ‌దు అనే క్ర‌మంలో వ‌చ్చే ఎమోష‌న‌ల్ స‌న్నివేశాలు ఈ సినిమాలో ఉంటాయి. మ‌ధ్య మ‌ధ్య‌లో సునీల్, బ్ర‌హ్మానందం కామెడీ ఈ సినిమాకు మ‌రో హైలెట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా 2000 సంవ‌త్సరంలో విడుద‌ల‌వ‌గా సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచింది.

Advertisement

ఈ సినిమా చాలా సెంటర్ల‌లో 100 రోజుల నుండి 50 వ‌ర‌కూ ఆడి రికార్డులు క్రియేట్ చేసింది. ఫ్యామిలీ హీరో వెంక‌టేష్ కు మ‌రో అద్బుత‌మైన విజ‌యాన్ని ఇచ్చింది. ఈ చిత్రానికి కోటి అందించిన స్వ‌రాలు మ‌రో హైలెట్ గా నిలిచాయి. త్రివిక్ర‌మ్ అందించిన మాటలు ఈ సినిమాకు మ‌రో చెప్పుకోద‌గ్గ విషయం.

ఇదిలా ఉంటే ఈ సినిమాను ద‌ర్శ‌కుడు విజ‌య భాస్క‌ర్ ల‌వర్ బాయ్ త‌రుణ్ కు చెప్పాడు. కానీ త‌రుణ్ వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉండ‌టం వ‌ల్ల నువ్వు నాకు న‌చ్చావ్ సినిమాకు నో చెప్పాడు. ఆ త‌ర‌వాత విజ‌య భాస్క‌ర్ ఈ క‌థ‌ను వెంక‌టేష్ కు వినిపించాడు. వెంక‌టేష్ కు క‌థ భాగా న‌చ్చ‌డంతో ఆయ‌న గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. అలా వచ్చిన నువ్వు నాకు న‌చ్చావ్ సినిమా అంద‌రికీ న‌చ్చి బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది.

ALSO READ : 

చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయిన 10 మంది సినీతారలు….వారి మృతికి కారణాలు….!

ఆచార్య ప్రీరిలీజ్ ఈవెంట్ కు సీఎం జ‌గ‌న్…ప‌వ‌న్ స‌త్తా చూపిస్తామంటూ ఫ్యాన్స్ ఫైర్..!

Visitors Are Also Reading