Home » అతి చిన్న వయసులో ప్రాణాలని వదిలేసిన ఈ 10 మంది నటులు ఎవరో తెలుసా ? వారి మృతికి కారణాలు

అతి చిన్న వయసులో ప్రాణాలని వదిలేసిన ఈ 10 మంది నటులు ఎవరో తెలుసా ? వారి మృతికి కారణాలు

by AJAY
Ad

సినిమా ఇండస్ట్రీలో రాణించాలని చాలామంది కలలు కంటారు. అయితే అవకాశం రావడం నటించడం అంత ఈజీ కాదు. అతి కొద్దిమందికి మాత్రమే ఆ అదృష్టం దక్కుతుంది. అలా కొంతమంది తమ టాలెంట్ తో ఇండస్ట్రీలోకి వచ్చి ప్రారంభంలోనే ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ కెరీర్లో ఎంతో సక్సెస్ ను చూడాల్సిన ఆ నటీనటులు అనుకోని కారణాల వల్ల చిన్న వయసులోనే చిత్ర పరిశ్రమకే కాకుండా ఈ లోకానికి కూడా దూరమయ్యారు. అలా చిన్న వయసులో మరణించిన సినీ తారలు ఎవ‌రో ఇప్పుడు చూద్దాం.

Advertisement

మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఉదయ్ కిరణ్ ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయారు. కానీ కెరీర్ లో వచ్చిన ఇబ్బందుల కారణంగా ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నారు.

ప్రేమికుల రోజు కునాల్ అంటే గుర్తు పట్టని వారు ఉండరు. తన నటనతో అందంతో కునాల్ ఆకట్టుకున్నారు. కానీ చిన్న వయసులోనే కునాల్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.

అష్టా చమ్మా సినిమాలో నాని కి చెల్లెలు గా భార్గవి అనే అమ్మాయి నటించింది. ఈ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న భార్యవి తన ప్రేమను ఇంట్లో ఒప్పుకోవటం లేదనే కారణంతో ఆత్మహత్య చేసుకుంది.

arthi agarwal
ఆర్తి అగర్వాల్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. స్టార్ హీరోల పక్కన హీరోయిన్ గా నటించింది. కానీ బరువు తగ్గేందుకు ఆర్తి అగర్వాల్ సర్జరీ చేసుకోగా అది వికటించి మరణించింది.

 

Advertisement

అమ్మాయిలు అబ్బాయిలు అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన విజయసాయి అనేక చిత్రాల్లో నటించి కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ కుటుంబ సమస్యల కారణంగా చిన్నవయసులోనే ఆత్మహత్య చేసుకున్నాడు.

ప్ర‌త్యూష త‌న అందం అభిన‌యంతో ఆక‌ట్టుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. కానీ ప్ర‌త్యూష ప‌ర్స‌న‌ల్ కార‌ణాల వ‌ల్ల చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకుంది.

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది.

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించిన దివ్యభారతి వ్యక్తిగత కారణాల వల్ల చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకుంది.

puneeth rajkumar

puneeth rajkumar

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించారు. ఆయన మరణాన్ని అభిమానులు ఇప్ప‌టికీ జీర్ణించుకోలేకపోతున్నారు.

ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన హీరో యశోసాగర్. మొదటి సినిమాతోనే యంగ్ హీరో మంచి విజయాన్ని అందుకున్నాడు. య‌శో సాగర్ కూడా చిన్న వయసులోనే రోడ్డు ప్రమాదం వల్ల మరణించాడు.

Also read : బికినీ వేస్తే బోల్డ్ అంటారు…చీర కడితే ఆంటీ అంటారు… ట్రోల్స్ పాయల్ స్ట్రాంగ్ రిప్లై…!

Visitors Are Also Reading