మహేశ్ బాబు హీరోగా నటించిన దూకుడు సినిమా బ్లాక్ బస్టర్ అయ్యిన సంగతి తెలిసిందే.ఈ సినిమాకు శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. సినిమాలో మహేశ్ బాబుకు జోడీగా సమంత నటించింది. సినిమాలో కామెడీ ఎమోషన్స్ మాస్ ఎలిమెంట్స్ ఇలా అన్నీ కలిసి బ్లాక్ బస్టర్ అయ్యింది. పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ తరవాత మహేశ్ బాబుకు వరుసగా మూడు డిజాస్టర్ లు వచ్చాయి. దాంతో మహేశ్ బాబు కృంగి పోయాడు. ఇక అలాంటి సమయంలోనే మహేశ్ బాబుకు దూకుడు సినిమా ఆఫర్ వచ్చింది.
Advertisement
శ్రీను వైట్ల వచ్చి మహేశ్ బాబుకు కథ వినిపించిన వెంటనే ఆయన ఇంప్రెస్ అయ్యారట. ఇక వెంటనే మహేశ్ బాబు డేట్స్ ఇవ్వడంతో దూకుడు సినిమా పట్టాలెక్కింది. అలా పూర్తి చేసిన ఈ సినిమా అంచనాలను దాటి బ్లాక్ బస్టర్ అవ్వగా ఈ సినిమా గురించి చెప్పుకోదగ్గ విషయాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా సినిమాలో కామెడీ హైలెట్ అని చెప్పాలి. ఎంఎస్ నారాయణ బ్రహ్మానందం పండించిన కామెడీ నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ లా నిలిచిపోయింది.
Advertisement
అంతే కాకుండా మహేశ్ బాబు ప్రకాశ్ రామ్ ల మధ్య ఉండే సన్నివేశాలు ఎంతో ఎమోషనల్ గా ఉంటాయి. ఈ సన్నివేశాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సినిమాలో మహేశ్ బాబు తండ్రి ప్రకాష్ రాజ్ పై విలన్ లు దాడి చేసి అతడిని తీవ్రంగా గాయపర్చడంతో చాలా ఏళ్లపాటూ కోమాలో ఉండి ఆ తరవాత బయటకు వస్తాడు. కోమా నుండి బయటకు వచ్చిన తండ్రికి గతం తెలియకూడదని మహేశ్ బాబు చాలా కష్టపడతాడు.
ఈ క్రమంలో వచ్చే సీన్లు ప్రేక్షకులను కట్టిపడేశాయి. అయితే ఈ సినిమాలో మహేశ్ బాబు తండ్రి పాత్ర మొదటగా రియల్ స్టార్ శ్రీహరి వద్దకు వెళ్లిందని చాలా మందికి తెలియదు. శ్రీను వైట్ల దర్శకత్వంలో శ్రీహరి కింగ్, ఢీ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించాడు. దూకుడు ఆఫర్ ఇవ్వగా శ్రీహరి మహేశ్ బాబు అన్నగా కథలో మార్పులు చేస్తే నటిస్తానని చెప్పారు. కానీ కథలో మార్పులు చేయడం కుదరకపోవడంతో శ్రీను వైట్ల ఆ పాత్ర కోసం ప్రకాష్ రాజ్ ను తీసుకున్నారట.
ALSO READ : “సావిత్రి” డ్యాన్స్ చేస్తే “అంజలీదేవి” గుంజిళ్ళు ఎందుకు తీసింది..?