మెగాస్టార్ చిరంజీవి గురించి తెలియని వారు ఉండనే ఉండరు. దాదాపుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి ఓ ఊపు ఊపారు. రీ ఎంట్రీ తరువాత కూడా ఖైదీ నెంబర్ 150, సైరా నర్సింహారెడ్డి వంటి సినిమాలతో హిట్ అందుకున్నప్పటికీ ఇటీవల కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య మాత్రం అంచనాలను అందుకోలేకపోయిందనే చెప్పాలి. ముఖ్యంగా తెలుగు సినీ ఇండస్ట్రీ ఉన్నంత వరకు చిరంజీవి పేరు మారు మ్రోగుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎన్టీఆర్ ఉన్నా లేకున్నా ఆయన పేరు నేటికి సినీ ఇండస్ట్రీలో గొప్పగా చెప్పుకోవడం విశేషం.
ముఖ్యంగా చిరంజీవి సాధారణ కుటుంబం నుంచి వచ్చి టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా ఎదిగారు. ఇదంత సినీ ప్రపంచానికి తెలిసినదే. చిరంజీవి సినిమాల్లోకి రాకముందు ఎలా ఉండేవారు..? ఆయన లుక్ ఎలా ఉండేది ఇలాంటి విషయాలు తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఆసక్తి ఉంటుంది. తాజాగా చిరంజీవి చిన్నప్పటి మిత్రుడు అప్పట్లో చిరుతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్ అవుతోంది. నెల్లూరు నగరంలో జనసేన నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి పవనన్న ప్రజాబాట పేరిట నిత్యం ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడుతున్నారు. ఈ తరుణంలోన ఓ ఇంటికి వెళ్లగా అక్కడ ఆయనకు అరుదైన ఫోటోలు లభించాయి.
Advertisement
Advertisement
మెగాస్టార్ చిరంజీవి చిన్ననాటి స్నేహితుడు నటరాజ్‌ను కేతంరెడ్డి కలిశారు. నటరాజ్ చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. చిరంజీవి అసలు పేరు శివశంకర వర ప్రసాద్ నేను చాలా క్లోజ్. ఒంగోలులో మేము డిగ్రీ చదివేటప్పుడు ఫోటో అని భద్రంగా దాచుకున్న ఫోటోను చూపించాడు. యవ్వనంలో ఉన్న చిరంజీవి ఫోటో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియోను కేతంరెడ్డి, వినోద్‌రెడ్డి ట్విట్టర్‌లో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి ఫోటో, ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read :
ఇంజెక్షన్ నరాలకు, శరీర అవయవాలకు ఎందుకు చేస్తారో తెలుసా..?
Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు అనుకున్నది సాధిస్తారు