Home » ‘అతడు’ సినిమాలో బ్రహ్మానందం కొడుకు తెలుసా..? ఇప్పుడు ఏమి చేస్తున్నాడంటే..?

‘అతడు’ సినిమాలో బ్రహ్మానందం కొడుకు తెలుసా..? ఇప్పుడు ఏమి చేస్తున్నాడంటే..?

by Bunty
Ad

అతడు సినిమాలో బ్రహ్మానందం కొడుకు అంద‌రికీ గుర్తే ఉంటాడు క‌దా..! నాన్నా ట్రైన్ తీసుకురమ్మన్నా.. తెచ్చావా అంటూ అని బ్రహ్మిని అడిగితే.. ఆ తెచ్చాన్ రా పట్టాల మీదుంది వెళ్లి పోయి తెచ్చుకో అంటాడు కదా..! ఇప్పుడు ఈ కుర్రాడు ఏం చేస్తున్నాడో తెలుసా..? మీకు తెలియ‌క‌పోతే మాత్రం తెలుసుకోండి. కొందరు బాల నటులు చేసేది తక్కువ సినిమాలే అయినా కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. అలా అతడు సినిమాలో ఉన్న నటించిన ఓ కుర్రాడు కూడా ఇప్పుడు తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం పాకులాడుతున్నాడు. 2005 ప్రాంతంలో చైల్డ్ ఆర్టిస్టుగా చాలా సినిమాలు చేసాడు ఆ కుర్రాడు. అతడి పేరు దీపక్. ఈ కుర్రాడు ఇప్పుడేం చేస్తున్నాడు తెలుసా..?

 

Advertisement

అతడు సినిమాలో బ్రహ్మానందం కొడుకు గుర్తున్నాడు కదా..? నాన్నా ట్రైన్ తీసుకురమ్మన్నా.. తెచ్చావా అంటూ అని బ్రహ్మిని అడిగితే.. ఆ తెచ్చాన్రా పట్టాల మీదుంది వెళ్లి తెచ్చుకో అంటాడు కదా..! ఆ తర్వాత భద్ర సినిమాలో అన్నయ్య సాంబార్‌లో చికెన్ వేసుకో బాగుంటుంది అని.. ఓ బుడ్డోడికి చిన్నది చెప్తుంది.. ఆ బుడ్డోడు ఇప్పుడు సినిమాల్లోకి రావడానికి ట్రై చేస్తున్నాడు. అతడి పేరు దీపక్ సరోజ్. ఇప్పుడు యవ్వనంలోకి వచ్చేసాడు దీపక్. చదువు పూర్తి చేసుకున్న ఈ కుర్రాడు.. ఇప్పుడు నటుడిగా సత్తా చూపించాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. ఇలాంటి సమయంలోనే ఈయనకు ఓ సినిమా ఆఫర్ వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు.

Advertisement

 

బాల నటుడిగా దాదాపు 20 సినిమాలకు పైగానే నటించిన దీపక్.. ఆ తర్వాత చదువు కోసం బ్రేక్ తీసుకున్నాడు. మళ్లీ చాలా ఏళ్ళ తర్వాత 2014లో మిణుగురులు సినిమాలో నటించాడు. దీనికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. మళ్లీ ఏడేళ్ళ తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీ వైపు వస్తున్నాడు. నిజానికి ఈ మధ్య ఈయనకు బిగ్ బాస్ 5 తెలుగు ఆఫర్ వచ్చినట్లు ప్రచారం జరిగింది కానీ అందులో నిజం లేదు. బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్ లిస్టులో దీపక్ సరోజ్ పేరు కూడా బాగానే వినిపించింది .ఆయన క్వారంటైన్‌లోనూ ఉన్నట్లు వార్తలొచ్చాయి. కానీ చివరికి అది జరగలేదు. తెలుగు ఆడియన్స్‌కు కేవలం బాల నటుడిగానే గుర్తున్న దీపక్.. ఇప్పుడు ఎలా ఉంటాడో ఊహించడం కష్టమే. హీరోలకు ఏ మాత్రం తక్కువ కానీ ఫిజిక్‌తో బాగానే రెడీ అయ్యాడు దీపక్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ కుర్రాడు స్పెషల్ ఫోటోషూట్స్ చేస్తున్నాడు. సినిమాలతో పాటు మోడలింగ్ వైపు కూడా అడుగులు వేస్తున్నాడు. వీటితోనే తాను కోరుకున్న గుర్తింపు వస్తుందని దీపక్ బలంగా నమ్ముతున్నాడు. మరి చూడాలిక.. ఈ కుర్రాడు ఏమి చేస్తాడనేది.

 

 

Visitors Are Also Reading