ఎవరైనా కొత్త వాహనాలను కొంటే.. వారు మొదట చేసే పని నిమ్మకాయాలను తొక్కించడం. ఈ పద్దతి పూర్వ కాలం నుంచి వస్తుంది. ఒకరి ని చూసి మరొక్కరు ఈ పద్దతిని ఫాలో అవుతున్నారు. బైక్ లు కార్లు ఇతర వాహనాలు ఏదీ కొన్నా.. మరుసటి ఆ వాహనానికి రోజు పూజ చేస్తారు. అలాగే ఆ వాహనం టైర్ల కింద నిమ్మ కాయాలు ఉంచి తొక్కిస్తారు. ఇలా చేయక పోతే వాహనానికి అలాగే యజమానికి కీడు జరుగుతుందని నమ్ముతారు. అయితే చాలా మందికి ఎందుకు చేస్తారో.. ఈ పద్దతి ఎలా వచ్చిందో తెలియదు. ఒకరి నుంచి ఒకరు చూసి ఇలా చేస్తున్నారు. కానీ నిజమైన కారణం చాలా మందికి తెలియదు. ఇప్పుడు మనం నిమ్మకాయాలను వాహనాల తో ఎందుకు తొక్కిస్తారో తెలుసుకుందాం.
Advertisement
పూర్వ కాలంలో వాహనాలు ఉండేవి కాదు. కానీ ఎడ్ల బండ్లు, గుర్రపు బండ్లు ఉండేవి. అప్పట్లో ప్రయాణాలన్నీ కూడా ఎడ్ల బండ్లు, గుర్రపు బండ్లతో నే సాగేవి. అయితే ఎడ్లు గానీ, గుర్రాలు గానీ ఎక్కువ దూరం నడివడం తో పాటు మరి కొన్ని సందర్భాలలో వాటి కాళ్లకు గాయాలు అయ్యూవి. ఆ గాయాల తోనే బురద లో మట్టిలో ఎడ్లు, గుర్రాలు నడిచేవి. దీంతో వాటికి అయిన గాయాలకు ఇన్ఫెక్షన్ సోకి పురుగులు పట్టేవి. దీంతో ఆ పుండ్లు ఇంకా పెద్దవిగా అయ్యేవి. అయితే ఆ పురుగుల ను నివారించడానికి, గాయాలను తగ్గించడానికి ఎడ్ల తో, గుర్రాల తో నిమ్మకాయలను తొక్కించేవారు.
Advertisement
ఇలా చేయడం వల్ల నిమ్మ కాయాలలో ఉండే సిట్రిక్ యాసిడ్ పుండ్లలో ఉండే బ్యాక్టిరియా ను చంపుతుంది. దీంతో గుర్రాలకు ఎడ్ల కు ఉన్న పుండ్లు త్వరగా తగ్గిపోతాయి. అందు కోసం నిమ్మకాయాలను తొక్కించేవారు. అందు చేత పూర్వం లో ఎవరైన ప్రయాణాల కు వెళ్తూంటే.. నిమ్మకాయాలను తొక్కించు అనే వారు. ఎడ్లకు గుర్రాలకు తొక్కించాల్సిన నిమ్మ కాయాలను ఇప్పుడు రబ్బర్ టైర్ల కింద తొక్కిస్తున్నారు. అయితే వాహనాల రబ్బరు టైర్ల కింద నిమ్మ కాయాలను తొక్కించడం వల్ల ప్రస్తుతం ఎలాంటి ఉపయోగం లేదు.