Home » మ‌హిళల‌ పెళ్లి వ‌య‌స్సును ఎందుకు పెంచారో తెలుసా?

మ‌హిళల‌ పెళ్లి వ‌య‌స్సును ఎందుకు పెంచారో తెలుసా?

by Bunty

ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం మ‌హిళల వివాహ వ‌య‌స్సును 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. దీనికి సంబంధిచిన నిర్ణ‌యం కేంద్ర మంత్రి మంత్రి మండ‌లిలో తీసుకున్నారు. అంతే కాకుండా ప్ర‌స్తుతం జ‌రుగుత‌న్న శీత‌కాల పార్ల‌మెంట్ స‌మావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును కూడా తీసుకువ‌స్తామ‌ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అయితే కేంద్ర ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం ఎంద‌కు తీసుకుంది. ఎలా తీసుకుంది. కార‌ణం ఎవ‌రూ అనే దాన్ని ఇప్పుడు చూద్ధం.

నిజానికి ఈ ప్ర‌తి పాధ‌న ఇప్పుటిది కాదు. గ‌త ఏడాది స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుకల స‌మ‌యంలో ప్ర‌ధాని మోడీ దీని పై ప్ర‌క‌ట‌న చేశారు. అప్పుడే దీనికి సంబంధించి క‌మిటీ కూడా వేశారు. 2020 జూన్ 4న జ‌య జైట్లీ నాయ‌కత్వం మొత్తం న‌లుగురి తో క‌మిటీ వేశారు. ఈ క‌మిటీ నివేధికను 2020 డిసెంబ‌ర్ లోనే కేంద్ర ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించింది. దీనిలో ముఖ్య మైన ప్ర‌స్తావ‌ణ‌లు ఇలా ఉన్నాయి. ప్ర‌తి రంగం లో స్త్రీ పురుష స‌మాన‌త్వం ఉంది. కానీ వివాహం లో స‌మాన‌త్వం లో లేదు. ఈ క‌మిటీ దేశ వ్యాప్తంగా మ‌హిళ‌ల‌తో స‌ర్వే చేసింది. ఈ స‌ర్వే లో మ‌హిళ వివాహ వ‌య‌స్సు 22 లేదా 23 ఉండాల‌ని చెప్పారు.

18 ఏళ్లప్పుడు వివాహం జ‌రిగితే తొలి కాన్పులో మ‌ర‌ణాలు రేటు ఎక్కువ గా ఉంది. అలాగే ఉన్నత విద్య కోసం. అయితే వివాహ వ‌య‌స్సును పెంచితే.. ప‌లు చ‌ట్టాల‌ను కూడా మార్చాల్సి ఉంటుంది. అలాగే వివాహం లో కూడా స్త్రీ పురుషులకు స‌మాన‌త్వం కూడా ఉండాల‌ని సుప్రీం కోర్టులో పిటిష‌న్ కూడా దాఖ‌లు అయింది. దీని పై విచార‌ణ కూడా జ‌రిగింది. అలాగే అమ్మాయిల‌కు వివాహానికి ముందు.. త‌ర్వాత కూడా స్వేచ్ఛ లేదు. 21 ఏళ్లలో వివాహం చేస్తే కాస్త స్వేచ్ఛ వ‌స్తుంద‌ని అంటుంన్నారు.

Visitors Are Also Reading