Home » ప్రస్తుత స్త్రీలు తమకంటే చిన్నవారిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారో తెలుసా..?

ప్రస్తుత స్త్రీలు తమకంటే చిన్నవారిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారో తెలుసా..?

by Sravanthi
Ad

పూర్వకాలంలో అయితే అమ్మాయికి అబ్బాయికి దాదాపుగా 10 ఏళ్ళు తేడా ఉండేది. అలా ఉంటేనే పెళ్లి కూడా చేసేవారు. ఆ విధంగా కాలం మారుతూ వచ్చింది వయసులో కూడా తేడా వచ్చింది. దీంతో ఒకటి రెండు సంవత్సరాల గ్యాప్ తో వివాహం చేసుకునే వారు. కానీ ప్రస్తుతం అంతా రివర్స్ అయిపోయింది. అబ్బాయిల కంటే అమ్మాయిలు వయసులో పెద్దగా ఉంటున్నారు. కానీ తమ కంటే చిన్నవారిని పెళ్లి చేసుకోవడం వెనుక అనేక కారణాలు ఉన్నాయని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు.. అదేంటో ఇప్పుడు చూద్దాం..

also read:తండ్రి కావాలనుకుంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..2 చాలా ఇంపార్టెంట్..!!

Advertisement

కొంతమంది మహిళలు వారి వయసు వారిని పెళ్లి చేసుకోవడానికి ఛాయిస్ లేకపోవడం వల్ల తమ కంటే తక్కువ వయసు ఉన్న వారిని, వివాహం చేసుకుంటున్నారు. కొంతమంది మహిళలు అయితే వివాహ తర్వాత చేసుకున్న వ్యక్తి అదుపులో ఉండడానికి వారి కంటే చిన్నవారిని ఎంచుకొని వివాహం చేసుకుంటున్నారు. అలాగే వారి కంటే చిన్నవారిని పెళ్లి చేసుకోవడం వల్ల జీవితంపై తన భర్త కంటే ఎక్కువగా అవగాహన కలిగి ఉంటారు.

Advertisement

వివాహ బంధంలో తలెత్తే సమస్యలను పరిష్కరించుకొని ముందుకు సాగుతారు. అంతేకాకుండా తనకంటే వయసులో చిన్నవాడిని పెళ్లి చేసుకున్న స్త్రీ వారికి అప్పుడు ఉన్న వయసు కంటే తక్కువ వయసు ఉన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటుందట. దీనివల్ల మళ్ళీ యాక్టివ్ గా మారే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా చిన్నవారిని పెళ్లి చేసుకోవడం వల్ల పురుషులు యాక్టివ్ గా ఉంటారని వారికి కావలసినవన్నీ ఇస్తారని, అత్యధిక సుఖాన్ని పొందవచ్చు అనే ఆలోచనతో కొంతమంది స్త్రీలు ఈ విధంగా వయసులో చిన్న వారిని పెళ్లి పెళ్లి చేసుకుంటారని నిపుణులు తెలియజేస్తున్నారు.

also read:నమ్రతా పెళ్లి విషయంలో కృష్ణ మహేష్ బాబును అడిగిన ఒకే ఒక ప్రశ్న.. ఏంటంటే..?

Visitors Are Also Reading