పెళ్లి లో పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడి నుదుట సాధారణం గా కనిపించే వాటిలలో బాసికం ముఖ్యం గా ఉంటుంది. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగే ప్రతి ఒక్క పెళ్లిలో వధు వరకుల నుదట బాసికం అనేది కనిపిస్తునే ఉంటుంది. ఈ బాసికం కట్టే పద్దతి పూర్వ కాలంలో నుంచి వస్తుంది. పూర్వ కాలంలో బాసికం కొంచెం పెద్ద సైజ్ లో ఉండేవి. కానీ ప్రస్తుతం ఆ సైజ్ ను తగ్గించి చిన్నవి బాసికం గా కడుతున్నారు. కానీ బాసికం కట్టడం మాత్రం మానడం లేదు. అయితే బాసికం కట్టడంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
Advertisement
Advertisement
పూర్వ కాలంలో హిందూ సంప్రదాయం, ఆచారం పేరుతో వధు వరుల నుదట బాసికం కట్టే వారు. కానీ దాని వేనుక సైన్స్ కు సంబంధించిన లాభాలు కూడా ఉన్నాయి. మానవ శరీరం లో మొత్తం 72 నాడులు ఉంటాయి. అందులో 14 నాడులు చాలా ముఖ్యమైనవి. ఈ 14 లో కూడా పింగళ, సుషుమ్న, ఇడ వంటి నాడులు చాలా ప్రాముఖ్యమైనవి. అయితే ఇందులో సుషుమ్న అనే నాడికి ఎడమ వైపు చంద్ర నాడి ఉంటుంది. అలాగే కుడి వైపు సూర్య నాడి ఉంటుంది. ఈ సూర్య నాడి, చంద్ర నాడి రెండు కూడా శరీరం తల భాగంలో నుదుట ఉంటాయి. సరిగ్గా అదే ప్రదేశం లో బాసికం కడుతారు. దీంతో ఆ నాడి లకు చాలా మంచి జరుగుతుంది.
అలాగే చంద్ర నాడి, సూర్య నాడి రెండు కలిసిన చోట అర్థ చంద్రాకారంలో ఉంటుంది. దీన్ని ఋషులు దివ్య వక్షవు అనే అంటారు. ఈ దివ్య వక్షవు వద్ద బాసికం కడితే దిష్టి తగలదని నమ్ముతారు. అలాగే అక్కడ బాసికం కట్టడం వల్ల ప్రమాదాలు, అశుభం కలగదని నమ్మకం. అందుకే హిందూ సంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లి వేడుకలలో పెళ్లి కూతురుకు, పెళ్లి కుమారుడికి నుదుట భాగం లో ఉండే దివ్వ వక్షవు వద్ద అర్థ చంద్రకారం, లేద త్రిభుజ ఆకారం లో గల బాసికం కడుతారు.