ఆధ్యాత్మికంగా మన వారు చెట్లను కూడా పూజిస్తారు. దీనికి కారణం తెలియక పోయినా.. చాలా మంది చెట్లకు పూజలు చేస్తారు. చెట్ల కు పూజలు చేయడం అనేది ఇప్పుడు పుట్టుకు వచ్చిన ఆచారం కాదు. ప్రాచీన కాలం నుంచి వస్తున్న సంప్రదాయం. అయితే ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు చెట్లను ఎందుకు పూజిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొంత మంది వేప చెట్టు, మామిడి చెట్టు, మర్రి చెట్టు ఇలా పలు రకాలు అయిన చెట్లను పూజిస్తారు. చాలా మంది చిన్న తులసి చెట్టును ఇంటి ముందు పెట్టుకుని ప్రతి రోజు పూజిస్తారు.
Advertisement
అయితే దానికి కారణం.. భగవంతుడు మానవ లోకాన్ని సృష్టించక ముందే.. చెట్లను సృష్టించాడు. తర్వాత మానవ లోకాన్ని సృష్టించాడు. దీంతో చెట్టు ఇచ్చే ఆక్సిజన్ తో మానవ లోకం బతుకుతుంది. చెట్టు లేకుంటే మానవ లోకం ఉండదు. దీంతో చెట్లను అప్పట్లో దేవుని గా భావిస్తు పూజాలు చేసే వారు. అలాగే మానవులలో దేవుడు ఉన్నట్టు.. చెట్లు, జంతువులలో కూడా దేవుడు ఉంటాడని ప్రాచీన కాలంలో నమ్మెవారు. దీంతో చెట్టు పూజిస్తే దేవున్ని పూజించినట్టే అని అనుకునే వారు. దీంతో కొన్ని చోట్లను ఎంచుకుని వాటికి దేవుళ్ల పేర్లు పెట్టి పూజించే వారు. అదే క్రమేపి చెట్లను పూర్తి గా పూజించేంత వరకు వచ్చింది.
Advertisement
అలాగే కొన్ని శాస్త్రాల ప్రకారం చెట్టను నరికి చంపితే శూనా అనే దోశం పట్టుకుంటుంది. దీంతో చెట్లను నరక కుండా పూజిస్తారు. అయితే చెట్లను దేవునిగా నమ్మడానికి కారణం రాత్రి సమయాల్లో మర్రి చెట్లు ఆక్సిజన్ ను ఇవ్వ కుండా భిన్నంగా కార్బన్ డై ఆక్సడ్ ను మాత్రమే ఇస్తాయి. దీంతో మర్రి చెట్ల కింద పడుకునే వాళ్లు మరణించే వారు. దీంతో దేవుడు ఆగ్రహించి చంపేశారని నమ్మేవారు. దీంతో మర్రి చెట్లతో పాటు ఇతర చెట్లను పూజించే వారు. ఆ సంప్రదాయం ఇప్పటి వరకు కూడా కొనసాగుతుంది.