Home » పాల రంగు ఎందుకు తెల్లగా ఉంటుందో తెలుసా ?

పాల రంగు ఎందుకు తెల్లగా ఉంటుందో తెలుసా ?

by Anji
Ad

సాధారణంగా ఆవులు, గెేదెలు ప్రతిరోజు పచ్చిగడ్డిని తింటాయి. వాటి శరీరంలో ప్రవహించే రక్తం చాలా ఎర్రగా ఉంటుంది. కానీ అవి ఇచ్చే పాలు మాత్రం చాలా తెల్లగా ఉంటాయి. అసలు పాలు ఎందుకు తెల్లగా ఉంటాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ? ఇవి మాత్రమే కాదు.. ఈ భూమిపై బిడ్డకు జన్మనివ్వగల అన్ని జీవుల పాల రంగు తెల్లగానే ఉంటుంది. 

Also Read :  భార్య భర్తను ఇలా చూసుకుంటే భర్త మరో స్త్రీ వైపు వెళ్లడు

Advertisement

ఇక ఈ జీవులలో మనిషి కూడా ఒకరు. ఇది ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడానికి మీరు ఎప్పుడైనా ప్రయత్నించారా ? శరీరంలో ఉండే కొన్ని రసాయనాల వల్ల పాలు తెల్లగా ఉంటాయి. వాస్తవానికి పాలు తెల్లగా ఉంటాయి. ఎందుకంటే.. ఇందులో వైట్ కలర్ కేసైన్ ఉంటుంది. పాలలోని ప్రధాన ప్రోటీన్లలో కేసైన్ ఒకటి. కాసిన్ పాలలో కాల్షియం, ఫాస్పేట్ త మైకేల్స్ అనే చిన్న కణాలను ఏర్పరుస్తుంది. ఈ మైకెల్ పై కాంతి పడినప్పుడు అది వక్రీభవనం చెందుతుంది. దీంతో పాలు తెల్లగా కనిపిస్తాయి. అంతేకాదు.. పాలలోని కొవ్వు కూడా తెలుపు రంగుకు కారణం అన్నట్టు.  

Advertisement

Also Read :  ఈ సమ్మర్ లో ఖర్భూజతో కలిగే లాభాలు తెలిస్తే అస్సలు వదిలి పెట్టరు..!

Calories in 1 Glass of Milk, Nutrition, Weight Loss - Bodywise

మీరెప్పుడైనా జాగ్రత్తగా గమనిస్తే.. గేదెతో పోల్చితే ఆవుపాటు కొద్దిగా పసుపు రంగులో కనిపిస్తాయి. ఎందుకంటే పాలలో ప్రోటీన్లు, కొవ్వులు, లాక్టోస్, కార్భోహైడ్రేట్స్ కాల్షియంతో పాటు విటమిన్లు, ఫాస్పరస్ వంటి పదార్థాలుంటాయి. ఆవు పాలలో బీటా కెరోటిన్ అనే పదార్థం కొంత ఎక్కువ మోతాదులో ఉంటుంది. అందుకే ఈ పాలు లేత పసుపు రంగులో ఉంటాయి. గేదె పాలలో ఆ పదార్థం లేకపోవడం వల్లనే పాలు తెల్లగా ఉంటాయి.  

Also Read :  స‌మంత నా క్ర‌ష్…ఓపెన్ గా చెప్పేసిన తేజ్ నెట్టింట వైర‌ల్..!

Visitors Are Also Reading