Home » ఇంటి గ‌డ‌ప పై ఎందుకు కూర్చోకూడ‌దో తెలుసా?

ఇంటి గ‌డ‌ప పై ఎందుకు కూర్చోకూడ‌దో తెలుసా?

by Bunty
Ad

ఇంటికి ప్ర‌ధాన ద్వారం వ‌ద్ద ఉండే గ‌డ‌ప పై కూర్చోంటే.. మ‌న ఇంట్లో పెద్ద‌లు గ‌డ‌ప పై కూర్చోకూడ‌దు అని చెబుతూ ఉంటారు. దానికి కార‌ణం ఎంటి అని ఎప్పుడైనా ఆలోచించారా..? పెద్ద వాళ్లు ఎందుకు గ‌డ‌ప పై కూర్చోవ‌ద్దు అని చెప్ప‌డం వెనుక అంత‌ర్యాం ఏమిటీ అని ఎప్పుడైనా ఎవ‌రినైనా ప్రశ్నించారా..? అయితే మీ ప్ర‌శ్న‌ల‌కు ఇక్క‌డ‌ స‌మాధాన‌లు ల‌భిస్తాయి. మ‌న ఇంట్లో ప్ర‌ధాన ద్వారం వ‌ద్ద ఉండే గ‌డ‌ప పై ఎందుకు కూర్చోకూడదో.. దానికి గ‌ల కార‌ణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటికి ప్రధాన ద్వారం లో ఉండే గడపపై కూర్చోకూడదని వాస్తు పండితులు అంటున్నారు. కార‌ణం ఎంటంటే..

Advertisement

Advertisement

ప్ర‌ధాన ద్వారం లో గ‌ల‌ గడపకు మధ్యలో కూర్చోవడం మంచిది కాదు. అంతే కాకుండా ప్ర‌ధాన ద్వారం లోగ‌ల‌ గడపకు కింద ఉండే మెట్లపై కూడా కూర్చోవడం మంచిది కాదు. ఈ రెండు ప్ర‌దేశాల‌లో కూర్చోవ‌డం వ‌ల్ల ఇంటిలోనికి వచ్చే లక్ష్మీదేవిని మ‌నం అడ్డుకున్న వాళ్లం అవుతామ‌ని వేద పండితులు చెబుతున్నారు. అలాగే ఇళ్ల క‌ట్టుకున్న స‌మ‌యంలో పూజాలు చేసి కొన్ని వ‌స్తువ‌లను ఇంటి ప్ర‌ధాన ద్వారం వ‌ద్ద గ‌ల గ‌డప కింద ఉంచుతాం. అలా పెట్టిన నాటి నుంచి గ‌డ‌ప ను కూడా దేవుడిలా.. ల‌క్ష్మీ దేవీలా మ‌నం పూజిస్తాం అందుకే గ‌డ‌ప పై కూర్చోకూడ‌ద‌ని అంటారు.

అలాగే సైన్స్ ప్ర‌కారం మ‌న ఇంట్లోకి ప్ర‌ధాన ద్వారాల నుంచి అలాగే కిటికీల నుంచి గాలి, వెలుతురు వ‌స్తుంటుంది. అయితే అలా వ‌చ్చే గాలి లో ఎక్కువ బ్యాక్టిరియా, వైర‌స్ ఉండే అవ‌కాశాలు ఎక్కువ గా ఉంటాయి. దీంతో అవి నేరుగా మ‌న పైనే ప‌డుతాయి. అందుకే గ‌డ‌ప పై కూర్చోవ‌డం మంచిది కాద‌ని అంటారు. అలాగే గాలి ఇంట్లోకి వ‌చ్చి ఇంట్లో ఉన్న నెగటివ్‌ ఎనర్జీ బయటికి తీసుకెళ్లుతుంది. ఈ స‌మ‌యం లో కూడా మ‌నం దానికి అడ్డు గా ఉండ‌కూడ‌దు. అందుకే గ‌డ‌ప పై కూర్చోవ‌డం అరిష్టం గా భావిస్తారు.

Visitors Are Also Reading