తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రభాస్ ఈశ్వర్ సినిమా ద్వారా వెండితెరపై అరంగేట్రం చేశారు. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు దక్కించుకొని బాహుబలి వంటి ఎంతో ప్రతిష్టాత్మకమైన చిత్రంలో నటించి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
Advertisement
ఇక, ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం తీరికలేని సమయాన్ని ప్రభాస్ గడుపుతున్నాడు. మరి అలాంటి ప్రభాస్ పై తాజాగా ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ఆయన ఓ బ్యాంకు నుంచి రూ. 21 కోట్ల రుణం తీసుకున్నట్టుగా ఈ వార్తలలోని సారాంశం. ప్రభాస్ ఏంటి? బ్యాంకు నుంచి అప్పు తీసుకోవడం ఏమిటి? వింటేనే ఆశ్చర్యకరంగా ఉంది కదా.
Advertisement
కానీ ఇది నిజమే అనేలా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం విశేషం. ప్రభాస్ సినిమా ఒప్పుకుంటే, ఆయనకి రూ. 100 కోట్ల పైన రెమ్యూనరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు లైన్ లో ఉన్నారు. మరి బ్యాంకు నుంచి రుణం తీసుకోవాల్సిన అవసరం ప్రభాస్ కి ఏంటనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. సోషల్ మీడియాలో దీనిపై రకరకాలుగా చర్చలు నడుస్తున్నాయి. హైదరాబాదులో ఉన్న తన ప్రాపర్టీపై ప్రభాస్ ఓ బ్యాంకులో రూ. 21 కోట్ల రుణం తీసుకున్నాడని, దానికి సంబంధించిన చెక్ తాజాగా ఆయన చేతికి అందిందనేది ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. దీనిపై త్వరలోనే క్లారిటీ వస్తుందని కొందరు చెబుతున్నారు.
Read also : Chalapati Rao: ఆర్యన్ రాజేష్ పెళ్లి పెద్దగా నిలబడ్డ చలపతిరావు.. ఎందుకంటే.?