Home » కార్తీక మాసం లోనే ఇంటి నిర్మాణాలు ఎక్కువ ఎందుకు జ‌రుపుతారో తెలుసా?

కార్తీక మాసం లోనే ఇంటి నిర్మాణాలు ఎక్కువ ఎందుకు జ‌రుపుతారో తెలుసా?

by Bunty
Ad

ఈ మ‌ధ్య కాలం లో గ‌మ‌నిస్తే ఇళ్ల నిర్మాణాలు ఎక్కువ గా జ‌రుగుతున్నాయి గ‌మ‌నించారా.. అలాగే కొంత మంది ఇళ్ల ను కూడా కొనుగోళ్లు చేస్తున్నారు. దీని కార‌ణం కార్తీక మాసం అని. కార్తీక మాసం లోనే చాలా మంది ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. మ‌న లో కూడా చాలా మంది ఇళ్ల ను కార్తీక మాసం లో నే ప్రారంభించి ఉంటారు. అసలు ఇళ్ల నిర్మ‌ణాన్ని కార్తిక మాసం లో నే ఎందుకు ప్రారంభిస్తారో తెలుసా? దీనికి బ‌ల‌మైన కార‌ణం ఉంది.

Advertisement

కార్తీకమాసం అనేది చాలా పవిత్రమైన మాసం. ఈ నెల‌లో ఇంటి నిర్మాణం చేపడితే ధనధాన్యాలకు ఎక్కువ గా వ‌స్తాయ‌ని న‌మ్ముతారు. అలాగే పంచాంగ నిపుణులు కూడా కార్తీక మాసం లోనే ఇళ్ల నిర్మాణం ప్రారంభించ‌మ‌ని సూచిస్తారు. ఈ కార్తీక మాసం లో కొత్త గా ఇంటి నిర్మాణం చేపట్టడం.. లేదా ఇంటి స్థలం కొనడం వంటివి చేసే వారికి సకలసంపదలకు క‌లుగుతాయ‌ని పంచాంగ నిపుణులు భావిస్తారు. అందుకే కార్తీకమాసంలో కొత్త గా ఇళ్ల నిర్మాణాలు ఎక్కువ గా జ‌రుపుతారు. అలాగే ఇళ్లు ను క‌నుగోలు చేసే వారు కూడా ఈ మాసం లోనే ప్రారంభం చేయాల‌ని పండితులు సూచిస్తారు.

Advertisement

అలాగే ఈ కార్తీక‌ మాసంలో ఇంటి నిర్మాణానికి సంబంధించిన పనులను ప్రారంభిస్తే.. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇంటి నిర్మాణం పూర్తి అవుతుంద‌ని న‌మ్ముతారు. అలాగే ఇంటి నిర్మాణం లో ఎలాంటి ఒడిదుడుకులు ఉండ‌వ‌ని.. ఆ ఇంటి లో వారు కలకాలం నివాసముంటారని పంచాంగ నిపుణులు అంటున్నారు. అలాగే మ‌రొక్క ముఖ్య కార‌ణం కూడా ఉంది. గ‌తంలో పంట పొలాలు వేసే వారికి స‌రిగ్గా కార్తీక మాసం లో నే పంట చేతికి వ‌చ్చేది. దీంతో డ‌బ్బులు కూడా స‌మృద్ధి గా ఉండేది. దీంతో ఇంటి నిర్మాణం చేస్తే వ‌చ్చిన పంట డ‌బ్బుల‌తో త్వ‌ర‌గా అవుతుంది. కాబ‌ట్టి కార్తీక మాసం లో నే ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించే వారు.

Visitors Are Also Reading