Home » కథ నచ్చినా వాళ్ళ కోసమే కృష్ణ “స్నేహంకోసం”” సినిమాను రిజెక్ట్ చేశారన్న సంగతి తెలుసా…!

కథ నచ్చినా వాళ్ళ కోసమే కృష్ణ “స్నేహంకోసం”” సినిమాను రిజెక్ట్ చేశారన్న సంగతి తెలుసా…!

by AJAY
Published: Last Updated on
Ad

సినిమా ఇండస్ట్రీలోకి స్టార్ హీరోల వారసులుగా ఎంట్రీ ఇస్తే నేరుగా హీరో అయిపోవచ్చు. కానీ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిందే. చిన్న చిన్న పాత్రలు చేయాల్సిందే… అలా చిన్న పాత్రలతో అదరగొడితే దానికి అదృష్టం కూడా తోడైతే హీరో అవ్వచ్చు. కానీ అలాంటి అదృష్టం, టాలెంట్ చాలా తక్కువ మందికి ఉంటుంది. అలాంటి టాలెంట్ ఉన్న వారిలో మెగాస్టార్ చిరంజీవి ముందు ఉంటాడు.

Advertisement

 

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి ఇండస్ట్రీని ఏలుతున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు. తన నటన, డాన్స్ లతో చిరంజీవి అభిమానులను సంపాదించుకున్నారు. అయితే కెరీర్ ప్రారంభంలో మెగాస్టార్ చిన్న పాత్రలు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సూపర్ స్టార్ కృష్ణ మెగాస్టార్ ను ఎంతో ప్రోత్సహించారు.

Advertisement

కృష్ణ మెగాస్టార్ కాంబినేషన్ లో కొత్తల్లుడు, కొత్త పేట రౌడీ లాంటి సినిమాలు వచ్చాయి. అయితే ఈ సినిమాలలో చిరంజీవి చిన్న పాత్రలు చేశాడు. కానీ 1980లో వీరిద్దరి కాంబినేషన్ లోనే తోడుదొంగలు సినిమా వచ్చింది. ఈ సినిమా మల్టీ స్టారర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ చిత్రం తర్వాత చిరంజీవి హీరోగా నటించిన ఖైదీ సినిమా విడుదలైంది. ఈ సినిమాతో మెగా స్టార్ ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయారు. ఇండస్ట్రీలో ఫుల్ బిజీ అయ్యారు. ఆ సమయంలో కృష్ణ ఒకవైపు రాజకీయాలు మరోవైపు సినిమాలను మేనేజ్ చేస్తున్నారు. అయితే చిరంజీవి స్టార్ అయిన తర్వాత స్నేహంకోసం అనే సినిమా చేస్తున్నారు.

అయితే ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర కోసం కృష్ణ ను తీసుకోవాలని మేకర్స్ భావించారు. సినిమాలో చిరంజీవి డబల్ రోల్ చేశారు. కాగా తండ్రి చిరంజీవి పక్కన నటించే స్నేహితుడుగా కృష్ణను తీసుకోవాలనుకున్నారు. ఇది సినిమాలో ప్రాముఖ్యత ఉన్న పాత్ర…. కానీ ఆ పాత్ర చేస్తే అభిమానులు హర్ట్ అవుతారు అని భావించిన కృష్ణ సినిమాలో నటించడానికి నో చెప్పారట. ఆ తర్వాత ఈ పాత్ర కోసం విజయ్ కుమార్ ను తీసుకున్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది.

Also Read: 

ఆచార్య న‌టించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవ‌రో తెలుసా…సినిమా ఛాన్స్ ఎలా వ‌చ్చిందంటే..! 

ఇన్స్టాలో రీఎంట్రీ ఇచ్చిన మెగాడాట‌ర్…ఈ ప్రపంచం ఇంకా అంతం కాలేదంటూ..!

Visitors Are Also Reading