Home » ఆచార్య న‌టించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవ‌రో తెలుసా…సినిమా ఛాన్స్ ఎలా వ‌చ్చిందంటే..!

ఆచార్య న‌టించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవ‌రో తెలుసా…సినిమా ఛాన్స్ ఎలా వ‌చ్చిందంటే..!

by AJAY
Ad

Acharya Movie Child Artist: మెగాస్టార్ చిరంజీవి కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ఆచార్య. ఈ సినిమా ఏప్రిల్ 29న థియేటర్లలో విడుదలయ్యింది. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ముఖ్యమైన పాత్రలో నటించారు. సిద్ధ అనే పాత్రలో చరణ్ కనిపించాడు. అదే విధంగా ఈ చిత్రంలో సోనూ సూద్ విల‌న్ గా నటించాడు. ఇక ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కి మిశ్రమ టాక్ వస్తోంది.

Advertisement

అయితే ఈ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ప్రేక్షకులను మెప్పించాడు. దాంతో ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరు అతని బ్యాగ్రౌండ్ ఏంటి అని తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరు ఆచార్య లాంటి భారీ బడ్జెట్ సినిమాలో ఎలా అవకాశం వచ్చింది అన్న విషయాన్ని ఇప్పుడు చూద్దాం… ఆచార్య సినిమాలో నటించిన అబ్బాయి పేరు మిథున్ శ్రేయాన్స్. మిథున్ మంచిర్యాల జిల్లా మందమర్రి కి చెందిన శ్రీధర్ సరిత దంపతుల కుమారుడు.

Advertisement

ప్రస్తుతం వీరి కుటుంబం హైదరాబాద్ లో స్థిరపడింది. హైద‌రాబాద్ లోని రామంతపూర్ లో మిథున్ కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. అంతేకాకుండా సెయింట్ జోసెఫ్ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. మిథున్ కు నటన పై ఎంతో ఆసక్తి ఉంది. దాన్ని గుర్తించిన అత‌డి తండ్రి శ్రీధర్ ఆచార్య సినిమా ఆడిషన్స్ జరుగుతున్న విషయాన్ని తన స్నేహితుడు విజయ్ కుమార్ ద్వారా తెలుసుకున్నాడు.

అలా మిథున్ ను ఆడిషన్స్ కి తీసుకెళ్లాడు. ఇక ఆడిషన్స్ లో మిథున్ డైలాగ్స్ చెప్పి కొర‌టాల శివ‌ను మెప్పించాడు. దాంతో మిథున్ శ్రేయాన్స్ కు కొరటాల అవకాశం ఇవ్వగా హైదరాబాద్ లోని కోకాపేట మరియు రాజమండ్రి ఏరియాల‌లో జర‌గిన షూటింగ్ ల‌కు హాజ‌ర‌య్యాడు.

Also read : 2022 లో ప్రపంచ వ్యాప్తంగా మైండ్ బ్లాక్ కలెక్షన్లు రాబట్టిన 4 సినిమాలు….!

Visitors Are Also Reading