Gold in pink paper : ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడే లోహం బంగారం (gold). చాలామంది మహిళలు బంగారాన్ని ఒక స్టేటస్ సింబల్ గా భావిస్తారు. మార్కెట్ లో ఏ వస్తువుకు కూడా లేని డిమాండ్ బంగారానికి ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మన భారతీయులు ప్రతి ఏడాది ఏదో ఒక శుభకార్యం నిమిత్తం బంగారం కొనుగోలు చేస్తూనే ఉంటారు. అయితే బంగారాన్ని కొనుగోలు చేసే సమయంలో చాలామంది ఈ విషయాన్ని గమనించే ఉంటారు. అది ఏంటంటే.. బంగారాన్ని కొనుగోలు చేసిన తర్వాత దానిని పింక్ కలర్ పేపర్ లో చుట్టి ఇవ్వటం మీరు గమనించే ఉంటారు. కానీ బంగారాన్ని పింక్ కలర్ పేపర్ లోనే చుట్టి ఎందుకు ఇస్తారో అనేది చాల మందికి తెలియదు.
Advertisement
ఏ వ్యాపారి అయినా సరే ఒక వస్తువు అమ్మే విధానంలో కొనుగోలుదారులకు ఎలా చూపిస్తే ఆకర్షనీయంగా కనిపిస్తుంది అనే అంశంపై దృష్టి పెడతారు. ఎందుకంటే ఒక వస్తువుని అమ్మేటప్పుడు దాని బ్యాగ్రౌండ్ బాగుంటేనే ఆ వస్తువు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఉదాహరణకు ఒక మనిషి తన శరీరరంగుకు సరిపడా దుస్తులు ధరించినప్పుడే వారి బాహ్యరూపం మరింత అందంగా కనిపిస్తుంది. అలాగే బంగారం , వెండి , వజ్రం లేదా ప్లాటినంతో చేసిన ఆభరణాలు ఎక్కువగా మెరుస్తాయి.
Advertisement
గోల్డ్ రంగులకు విరుద్ధంగా ఉన్నప్పుడు గ్లో హైలైట్ అవుతుంది. ఆభరణాలు గీతలు పడకుండా ఆభరణాలను రక్షించడానికి నగల వ్యాపారులు ఎల్లప్పుడూ పేపర్ షీట్లను ఉపయోగిస్తారు. శాస్త్రీయంగా గులాబీ రంగు కాగితం బంగారం కాంతిని ప్రతిబింబించేలా ఆభరణాలు మరింత ఆకర్షణయంగా కనిపించేలా చూపిస్తాయి. ఒకవేళ చుట్టే కాగితం తెల్లగా ఉంటే మనకు చూపించే ఆభరణాలు ఎక్కువగా తెలుపు రంగులను ప్రతిబింబిస్తుంది. తద్వారా ఆభరణాల మెరుపు తగ్గుతుంది. అలాంటప్పుడు నలుపు రంగు ఇంకా ఎట్టాక్టివ్ గా కనిపిస్తుంది కదా అనే అనుమానం మీలో వచ్చి ఉండవచ్చు.
నలుపు అనేది మన హిందూ ధర్మంలో అశుభానికి సూచికగా ఉపయోగిస్తూ ఉంటారు. అందువలన బ్లాక్ కలర్ పేపర్‌లో చుట్టిన ఆభరణాలను ప్రజలు కొనడానికి ఇష్టపడరు. అందుకే ఆభరణాల వ్యాపారులు గులాబీ రంగును ఎంచుకున్నారు. ఈ గులాబీ రంగు కాగితం అనేది బంగారు ఆభరణాలను మరింత ఆకర్షణీయంగా చూపిస్తుంది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
vastu tips: ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవలా? అయితే ఈ టిప్స్ ను కచ్చితంగా ఫాలో అవ్వండి!
ఆడవాళ్ళూ.. నైటీలు వేసుకుంటున్నారా? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!
Eating on bed : మంచం మీద కూర్చొని భోజనం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా..?