తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇటీవల అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు లో ఖైదీ జీవితాన్ని అనుభవిస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఏపీలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో భాగంగా జరిగిన అవినీతిలో చంద్రబాబు నాయుడి పాత్ర ఉందని సాక్షాలు దొరకడంతో ఏపీ సిఐడి పోలీసులు చంద్రబాబును అరెస్టు చేశారు. గత శుక్రవారం అంటే సెప్టెంబర్ 8వ తేదీన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును అర్ధరాత్రి అరెస్టు చేశారు ఏపీ సిఐడి పోలీసులు.
కానీ శనివారం ఉదయం 6 గంటలకు అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొని… విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలించారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబును శుక్రవారమే ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. 2019 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చింది. అయితే 2019 నుంచి ఇప్పటివరకు చాలామంది తెలుగుదేశం పార్టీ కీలక నేతలను సీఎం జగన్ ఆదేశాల మేరకు ఏపీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ కీలక నేతలందరినీ శుక్రవారం మాత్రమే అరెస్టు చేశారు. శుక్రవారం రోజున అరెస్టు చేస్తే… సోమవారం వరకు బెయిల్ రాదనే ఉద్దేశంతోనే… జగన్ సర్కార్ ఇలా వ్యవహరిస్తుందని టిడిపి నేతలు చెబుతున్నారు.
Advertisement
Advertisement
కోర్టుకు సెలవులు ఉంటాయి కనుక… సోమవారం వరకు బెయిల్ రాదని వారు చెబుతున్నారు. కాగా…. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు నాయుడును మొన్న ఆయన కుటుంబం, నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు బాలయ్య బాబు, నారా లోకేష్ ములాఖత్ లో భాగంగా కలిశారు. ఈ మూలాఖత్ అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తాయని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎలాగైనా కూల్చుతామని హెచ్చరించారు పవన్ కళ్యాణ్.
ఇవి కూడా చదవండి
- చంద్రబాబు దొంగగా దొరికితే.. ముఠా జీర్ణించుకోలేకపోతుంది : సీఎం జగన్
- MS Dhoni : సాధారణ ఫ్యాన్ కు లిఫ్ట్ ఇచ్చిన ధోనీ.. వీడియో వైరల్
- పవన్ కళ్యాణ్ పై రోజా సంచలన వ్యాఖ్యలు..భార్య ఉండగా వేరే అమ్మాయితో ! !