Home » ఆల‌యాల్లో గంట ఎందుకు మోగిస్తారో కార‌ణం తెలుసా?

ఆల‌యాల్లో గంట ఎందుకు మోగిస్తారో కార‌ణం తెలుసా?

by Bunty
Ad

ప్ర‌తి దేవాల‌యాల్లో గంట త‌ప్ప‌ని స‌రిగా ఉంటుంది. సాధార‌ణం గా భ‌క్తులు కూడా దేవాలయాల్లోకి వెళ్ల‌గానే గంట‌ను మోగిస్తారు. గంట‌ను మోగించిన త‌ర్వాతే.. దేవుడికి మొక్కుతారు. ఆ సంప్ర‌దాయం ఇప్ప‌టి నుంచే కాదు.. పురాత‌న కాలం నుంచి వ‌స్తుంది. త‌ర త‌రాలు గా ఒక్క‌రిని చూసి ఒక్క‌రు దేవాల‌యాల్లో గంట‌ను మోగిస్తారు. దాని త‌ర్వాతే.. దేవుడి కి ప్రార్థ‌న‌లు చేస్తారు. అయితే దేవాల‌యాల్లో మ‌నం ఎందుకు గంట ను మోగిస్తాం అనే ప్ర‌శ్న కూడా చాలా మందికి వ‌చ్చే ఉంటుంది.

Advertisement

Advertisement

కానీ దీనికి చాలా మంది స‌రి అయిన సమాధానం తెలియ‌దు. దీంతో ఎదో ఒక‌టి చెప్పెస్తారు. అయితే దేవాల‌యాల్లో గంట ను కొట్ట డానికి బల మైన కార‌ణాలు ఉన్నాయి. దేవాల‌యాల్లో మ‌నం గంట ను కొట్టిన‌ప్పుడు వ‌చ్చే శ‌బ్ధం మంగ‌ళ క‌ర‌మైంద‌ని పండితులు చెబుతారు. ఆ శ‌బ్ధం నుంచి ఓంకార నాదాం వినిపిస్తుంద‌ని పండితులు చెబుతారు. అలాగే హ‌ర‌తి ఇచ్చే స‌మ‌యంలో కూడా గంట ను కొడుతారు. దాని నుంచి వ‌చ్చే శ‌బ్ధం శుభం అయిన‌ది అని.. ఓంకారాన్ని ఉద్భ‌వించేలా ఉంటుంది కాబ‌ట్టి గంట‌ను మోగిస్తార‌ని వేంధ‌త పండితులు చెబుతారు.

అలాగే పూజా చేసే స‌మ‌యాల్లో, దేవాల‌యాలకు వెళ్లే స‌మ‌యాల్లో, హ‌రతి ఇచ్చే స‌మ‌యాల్లో గంట‌ను కొట్ట‌డం వ‌ల్ల మ‌న మ‌న‌స్సు ఏకాగ్ర‌త అనేది దేవుడి పై ప‌డుతుంది. మ‌న‌ల్ని భ‌క్తి మార్గం లో న‌డిపించ‌డానికి గంట ను కొడుతారు. పూజా స‌మ‌యంలో గంట కొట్ట‌డం వ‌ల్ల మ‌న ఏకాగ్ర‌త మొత్తం కూడా దేవుడి భ‌క్తి పై ఉంటుంది. అందుకే దేవాల‌యాల్లో గంట‌లను మోగిస్తారు.

Visitors Are Also Reading