మనం ఎప్పుడూ చేసే ఆపిల్ ఫోన్స్ వెనకాల ఆపిల్ ను సగం కొరికనట్టు కనిపిస్తుంది. ఒక మొబైల్స్ లో నే కాకుండా ఆపిల్ సంస్థ అన్ని వస్తువలలో ఇలాగే ఆపిల్ ను సగం కొరికేసిన విధం గా కనిపిస్తుంది. ఆ సగం కొరికిన ఆపిల్ ఆ సంస్థ యొక్క లోగో. అయితే ఆపిల్ కంపెనీ వాళ్లు తమ లోగో గా సగం కొరికిన ఆపిల్ ను ఎందుకు పెట్టుకున్నారో తెలుసా. అలా ఎందుకు ఉందని ఎప్పుడు అయినా.. ఆలోచించారా..? అయితే ఆపిల్ సంస్థ తన లోగో గా సగం కొరికిన ఆపిల్ ను ఎందుకు ఎంపిక చేసుకుందో తెలుసుకుందాం.
Advertisement
నిజానికి ఆపిల్ సంస్థ ప్రొడక్ట్స్ ఎంత పాపులర్ అయ్యాయో.. అంత కన్న ఎక్కువ పాపులరిటీ ఆ లోగో కే వచ్చింది. ఆ సగం కొరికిన ఆపిల్ వల్లే ఆపిల్ సంస్థ కు ఎక్కువ పాపులారిటీ వచ్చిందని చెప్పాలి. అయితే ఆ సగం కొరికిన ఆపిల్ ను లోగో గా ఎంచుకోవడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. మొదటి ఆపిల్ సంస్థ కు లోగో గా న్యూటన్ ఆపిల్ చెట్టు కింద ఉన్న ఫోటో లాంటిది లోగో గా ఉండేది. అయితే ఆ లోగో ఆపిల్ చీఫ్ స్టీవ్ జాబ్స్ కు నచ్చలేదు. దీంతో కొత్త లోగో పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఒక నల్లటి రంగు లో ఉన్న ఆపిల్ ను గీశారు. కానీ అది కూడా స్టీవ్ జాబ్స్ కు నచ్చలేదు. అయితే ఆపిల్ వన్ ఫోన్ సమయంలో బైట్ ది ఆపిల్ అనే ట్యాగ్ లైన్ తో విక్రయించారు. అయితు బైట్ అనగా.. కొరకడం. దీంతో ఆపిల్ ను కొరికితే ఎలా ఉంటుందని ఆలోచించారు.
Advertisement
దీంతో ట్యాగ్ లైన్ నే లోగో లో ఉంటుందని అనుకుని ఆపిల్ ను కొరికినట్టు లోగో గా మార్చారు. ఆ లోగో నే ఇప్పటి వరకు కొనసాగుతు వచ్చింది. అయితే మరి కొంత మంది మరో విధం గా కూడా చెబుతారు. ఆపిల్, చెర్రీ రెండు ఒకే విధం గా ఉంటాయని.. అందుకే ఆపిల్ ను కొరికినట్టు ఉంటే అది ఆపిల్ గా స్పష్టం గా ఏర్పాడుతుందని అందుకే అలాంటి లోగో ను ఎంపిక చేశారని అంటారు. అలాగే మరి కొందరు ఆపిల్ లోగో అనేది బైబిల్ లో ఉన్న ఆడమ్ , ఈవ్ కథ తో వచ్చిందని అంటారు.