నందమూరి తారకరత్న గత రెండు రోజుల నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త క్రిటికల్ గానే ఉన్నట్టు తెలుస్తోంది. తారకరత్నకి ప్రత్యేక వైద్య సిబ్బంది సమక్షంలో చికిత్స జరుగుతుందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఈయన ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగు అవుతుందని తెలుస్తుంది. ఈయన ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడంతో చాలా మంది తారకరత్న వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు.
Advertisement
ఈ నేపథ్యంలోనే తారకరత్న విజయ్ సాయిరెడ్డి భార్య సునంద సొంత చెల్లెలు కుమార్తె అలేఖ్య రెడ్డిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఈమె సినీ ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తున్నారు. తారకరత్న నటించినటువంటి నందీశ్వరుడు సినిమాకి ఈమె కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేశారు. తారకరత్న అలేఖ్య పెళ్లి మొదటిది కాదు అని.. అలేఖ్యకి ఇదివరకే పెళ్లి జరిగిందనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన అనంతరం రెండో వివాహంగా తారకరత్నను పెళ్లి చేసుకున్నారు. ఇలా తారకరత్న నటించినటువంటి సినిమాకు ఈమె కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసారు.
Advertisement
Also Read : తారకరత్న కు ఈరోజు కీలకం….. ఆ విషయం నేడే తేలనుందా…?
అలేఖ్య తన మొదటి వివాహం టీడీపీ మాజీ హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి కుమారుడు సందీప్ రెడ్డితో జరిగింది. తొలిసారి సందీప్ రెడ్డిని పెళ్లి చేసుకున్న ఈమె కొంత కాలం పాటు తన వైవాహి జీవితంలో సంతోషంగా ఉన్నప్పటికీ.. వీరిద్దరి మధ్య తలెత్తిన మనస్పార్థాలతో ఇద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. విడాకులు తీసుకొని ఒంటరిగాఉన్నటువంటి అలేఖ్యకి తారకరత్నతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో వీరిద్దరూ ఆగస్టు 02, 2012న సంఘీ టెంపుల్ వద్ద పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. సోషల్ మీడియా ఈ వార్త ప్రస్తుతం చక్కర్లు కొడుతుంది.
Also Read : కొత్త బంగారులోకం సినిమాని మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా..?