టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దూకుడు’ దాదాపు అందరికీ గుర్తుండే ఉంటుంది. 2011 వ సంవత్సరంలో సెప్టెంబర్ 23 న విడుదల అయిన ఈ సినిమా .. భారీ అంచనాల మధ్య విడుదల అయి బ్లాక్ బస్టర్ అయింది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర కలిసి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమాకి ముందు మహేష్ చాలా ప్లాప్ లు ఉన్నారు.
Advertisement
‘పోకిరి’ తర్వాత మహేష్ సినిమా చేసిన సైనికుడు, అతిథి, ఖలేజా వంటి సినిమాలు ప్లాప్ అయ్యాయి. దీంతో మహేష్ బాబు ని మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కించిన సినిమా ఇదే. ఈ సినిమాలో ముఖ్యంగా తండ్రి పాత్ర చాలా కీలకమైనది. ఎందుకంటే కథ మొత్తం ఆ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. అందుకే ఈ పాత్ర కోసం దర్శకుడు శ్రీను వైట్ల చాలా మంది స్టార్స్ ను అప్రోచ్ అయ్యాడు. తొలుత ‘దూకుడు’ లో హీరో తండ్రి పాత్ర కోసం శ్రీహరి ని అడిగాడట.
Advertisement
కానీ ఆ టైంకి ఫాదర్ రోల్ చేయడం ఇష్టం లేక ఆయన నో చెప్పారట. అయినా సరే ఈ ప్రాజెక్టుని వదులుకోలేక బ్రదర్ రోల్ గా మార్చు చేస్తాను అని అన్నాడట. కానీ తండ్రి కాకుండా అన్నగా మారిస్తే ఎమోషనల్ గా ప్రేక్షకులు కనెక్ట్ అవ్వరు అని భావించి శ్రీను వైట్ల కూడా వెనక్కి తగ్గారట. ఇక ఆ తర్వాత మహేష్ సూచన మేరకు ప్రకాశ్ రాజ్ ను తీసుకున్నాడట శ్రీను వైట్ల.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
నిన్నే పెళ్లాడుతా మూవీ క్లైమాక్స్ ని… నాగార్జున కి దర్శకుడు చెప్పలేదు.. ఎందుకంటే..?
ప్రొడ్యూసర్ల కొడుకులు అయినా… ఇండస్ట్రీలో ఫెయిల్ అయిన హీరోలు వీళ్ళే..!