పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మల్టీ సార్టర్లుగా తెరకెక్కిన బ్రో చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. తమిళ సినిమా వినోదయ సీతంకు రీమేక్ గా వచ్చిన బ్రో చిత్రాన్ని తెలుగు మరియు తమిళ భాషల్లో సముద్రఖనియే దర్శకత్వం వహించారు. మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగువారి అభిరుచికి తగ్గట్లుగా కథలో మార్పులు, చేర్పులు చేశారు. సముద్రఖని ఈ చిత్రాన్ని కేవలం 21 రోజుల్లోనే సినిమాను పూర్తి చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈనెల 28న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులలో పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ పరంగా దూసుకుపోతుంది.
Advertisement
టైమ్ సెంటిమెంట్ తో అల్లుకున్న ఈ సినిమా కథను ప్రేక్షకుల్లో పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.. ఇక సిస్టర్స్ సెంటిమెంట్ వంటి ఎమోషనల్ టచ్ కూడా ఈ సినిమా కథకు బలాన్ని చేకూర్చింది. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన కేతిశర్మ హీరోయిన్ గా నటించింది . ఈ సినిమా కథ విషయంలోకి వెళ్తే మన హీరో మార్కండేయకు ఇద్దరు చెల్లెల్లు, ఒక తమ్ముడు ఉంటారు. ఈ సినిమాలో మార్కండేయకి చెల్లెలుగా ప్రియా ప్రకాష్ వారియర్, యువ లక్ష్మి కనిపించారు. ఈ సినిమాలో మన హీరో గాయత్రి (యువలక్ష్మీ) చెల్లెలంటేనే ఎక్కువ ఇష్టపడతాడు. ఒక రకంగా చెప్పాలంటే హీరోయిన్లు కేతిక, ప్రియా ప్రకాష్ వారియర్ కన్నా యువలక్ష్మి నటించిన గాయత్రి పాత్రకే ఈ మూవీలో ఎక్కువ స్కోప్ ఉంది.
Advertisement
అయితే ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ చెల్లెలుగా నటించిన యువలక్ష్మి పెద్ద యాక్టర్ అని తెలుసా..? బహుశా ఈ విషయం చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఆ అమ్మాయి అనేక చిత్రాలలో నటించింది. యువలక్ష్మి చిన్నప్పటి నుండే అనేక సినిమాలు, టీవీలో చిన్న పిల్లల షో కూడా కనిపించింది. చైల్డ్ ఆర్టిస్టుగా అనేక సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమిళంలో సముద్ర ఖని, అమల్ పాల్ నటించిన అమ్మ కనక్కు అనే సినిమాలో వారి కూతురిగా కనిపించింది.
కాంచన 3, వినోదయ సీతం వంటి చిత్రాల్లో కూడా నటించింది. యువలక్ష్మి నటించిన అన్ని చిత్రాలు కూడా సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి. తమిళంలో ఎక్కువ సినిమాలు నటించిన యువ లక్ష్మి ప్రస్తుతం బిజీ ఆర్టిస్ట్ గా మారింది. ఇక బ్రో చిత్రంతో తెలుగు తెరక కూడా పరిచయమైంది యువ లక్ష్మి. బ్రో చిత్రంలో సాయిధరమ్ తేజ్ చెల్లెలుగా ఎంతో చక్కగా నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం బ్రో సినిమా సక్సెస్ కావడంతో యువలక్ష్మికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
పవన్ కళ్యాణ్ ‘BRO’ మూవీకి ఫస్ట్ అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా ?
తెలుగు సినిమాల పై సాయిపల్లవి సంచలన నిర్ణయం.. అందుకోసమేనా ?
సూపర్ స్టార్ బిరుదుపై రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు..! ఇంతకీ ఏమన్నారంటే..?