ఈ భూమిపై ఎంతో మంది పుడుతుంటారు. కానీ, కొందరు మాత్రమే చరిత్ర పుటల్లోకి సుస్థిర స్థానాన్ని సంపాదించుకొని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అలాంటి వారిలో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఒకరు. మన తెలుగువారిని రాముడు, కృష్ణుడు ఎలా ఉంటారు అని అడిగితే ఆ రూపాల్లో ఉన్న తారక రాముడినే చూపిస్తారు. పౌరాణిక, ఇతిహాసాల దగ్గర నుంచి జానపద, సాంఘిక చిత్రాల వరకు అనేక పాత్రలలో నటించి ప్రేక్షకులతో నీరాజనాలు అందుకున్న మహా వ్యక్తి ఎన్టీఆర్.
Advertisement
రాజకీయలోకి అడుగుపెట్టి తెలుగు ప్రజల గుండెల్లో మహానేత నిలిచిపోయారు ఎన్టీఆర్. హీరోగా, దర్శకుడుగా, నిర్మాతగా, గొప్ప రాజకీయ నాయకుడిగా ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు అన్నగారు. ఎన్టీఆర్ గురించి మనకు తెలియని ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఎన్టీఆర్ భారతీయ సంప్రదాయాలపై, శాస్త్రాలపై, ఆచరాలపై ఎంతో మక్కువ ఎక్కువగా ఉండేది. దీంతో ఆయన తిరుపతి వెంకట కవులను తరచుగా కలుస్తూ ఉండేవారట. ఆయన సీఎంగా ఉన్న సమయంలో ఆయన ప్రభుత్వంలో వారిని ఆస్థాన విధ్వంసులుగా కూడా పెట్టుకున్నారు.
Advertisement
ఈ నేపథ్యంలోని ఎన్టీఆర్ మన భారతీయ సంప్రదాయాలతో పెళ్లిళ్లు చేయడం కూడా నేర్చుకున్నారు. పూర్తి సాంప్రదాయ బద్దంగా ఎన్టీఆర్ వివాహాలు చేయడంలో ప్రావీణ్యం పొందారు. దీనికోసం ఎన్టీఆర్ చాలా కష్టపడ్డారు. అయితే ఎన్టీఆర్ ఎంతో కష్టపడి పెళ్లిళ్లు చేయటం నేర్చుకున్నారు కానీ, ఆయనతో వివాహం చేయించుకునేది ఎవరు అనే విషయం మాత్రం అలా మిగిలిపోయింది. అదే సమయంలో ఎన్టీఆర్ గారికి బాగా సన్నిహితంగా మెలిగే యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఎవరు ఊహించిని విధంగా ఓ చిన్న ప్రయత్నం చేశారు.
అప్పుడే టీడీపీలో కొత్తగా చేరిన మోహన్‌రెడ్డి తన కుమార్తె వివాహానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయం కాస్త యార్లగడ్డకు లక్ష్మీ ప్రసాద్ తెలియడంతో వెంటనే ఆయన ఖర్చు అంతా కూడా తానే భరిస్తానని చెప్పారట. కానీ దానికోసం మోహన్ రెడ్డికి ఓ కండిషన్ పెట్టారట. అన్నగారు వివాహ సంప్రదాయాన్ని బాగా ఔపోసన పట్టారని ఆయనతో నీ కుమార్తె వివాహం జరిపించు.. వారి జీవితాలు బాగుంటాయని సలహా ఇచ్చారట. అలా తొలి సారి మోహన్‌రెడ్డి కుమార్తెకు ఎన్టీఆర్ స్వయంగా పౌరోహిత్యం వహించి మంత్రాలు చదివి వివాహం జరిపించారట. ఎన్టీఆర్ స్వయంగా మంత్రాలు చదివి దగ్గరుండి జరిపించిన తొలి మరియు చివరి మోహన్ రెడ్డి కుమార్తెదే కావడం గమనార్హం.