టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అనుష్కను స్టార్ హీరోయిన్ గా నిలబెట్టిన చిత్రాలలో అరుంధతి సినిమాది అగ్రస్థానమనే చెప్పవచ్చు. అప్పటివరకు తన అందాల ఆరబోతకు ప్రాధాన్యతను ఇచ్చిన అనుష్క..
Advertisement
అరుంధతి చిత్రంలో ఏకంగా తన నట విశ్వరూపం చూపించింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అందుకున్న ఈ సినిమాలో అనుష్క జీవితాన్నే మార్చేసింది. అప్పటి నుంచి అరుంధతి అంటే అనుష్క, అనుష్క అంటే అరుంధతి అని ప్రేక్షకుల మనసులో బలంగా ముద్ర పడింది. మల్లెమాల ఎంటర్టైన్మెంట్ పై శ్యామ్ ప్రసాద్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు అగ్ర దర్శకుడు అయినటువంటి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు.
అనుష్క మెయిన్ లీడ్‌గా నటించిన ఈ సినిమా విడుదలై 13 ఏళ్లు పూర్తి చేసుకుంది. వాస్తవానికి ఈ సినిమా ఛాన్స్ తొలుత అనుష్కకు రాలేదట. మలయాళం హీరోయిన్ మమతా మోహన్‌దాస్‌ను అరుంధతి సినిమా కోసం సంప్రదించారట దర్శకనిర్మాతలు. కానీ అప్పుడే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మమతా మోహన్ దాస్‌కు ఎలాంటి కథలు ఎంచుకోవాలనేది పెద్దగా తెలియక, అప్పటికే ఇతర ప్రాజెక్టులను చేస్తుండటంతో అరుంధతిని వదులు కోవాల్సి వచ్చిందని.. గతంలో ఓ ఇంటర్వ్యూలో మమతామోహన్‌దాస్ చెప్పుకొచ్చింది.
Advertisement
అరుంధతి ఆఫర్ వచ్చిన రెండు నెలలకే తనకు క్యాన్సర్ ఉన్నట్టు తేలడంతో సినిమా చేయడం కంటే బతికుంటే చాలు అనే భావనతో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్టు కూడా పేర్కొంది. ఆ తరువాత ఆ కథ అనుష్క వద్దకు రావడం.. కథ నచ్చి ఆమె ఓకే చెప్పడం అన్ని చకచకా సాగిపోయాయి. ఇక ఈ చిత్రం విడుదల అయిన తరువాత అనుష్కను జేజమ్మ, అరుంధతి అని పిలవడం మొదలుపెట్టారు. టాలీవుడ్ లో సీనియర్లను పక్కన పెడితే.. ఇప్పుడున్న హీరోయిన్లలో లేడి ఓరియెంటెడ్ సినిమాలకు అరుంధతి పునాది వేసిందనే చెప్పవచ్చు. అరుంధతి తరువాత కొన్ని లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసినా అవి అంతగా వర్కవుట్ కాలేదు..!
Also Read: ఇప్పటికీ ఆ రూమ్ కు రెంట్ కడుతున్న త్రివిక్రమ్ సునీల్.. ఎందుకో తెలుసా..?