Home » ఇప్పటికీ ఆ రూమ్ కు రెంట్ కడుతున్న త్రివిక్రమ్ సునీల్.. ఎందుకో తెలుసా..?

ఇప్పటికీ ఆ రూమ్ కు రెంట్ కడుతున్న త్రివిక్రమ్ సునీల్.. ఎందుకో తెలుసా..?

by AJAY
Ad

కొంతమంది సక్సెస్ రాగానే తమ మూలాలను మరిచి పోతుంటారు. కానీ కొంతమంది జీవితంలో ఇంత పైకి ఎదిగినా తమ మూలాలను మాత్రం మర్చిపోరు. సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ డైరెక్టర్ గా ఎదిగిన త్రివిక్రమ్ శ్రీనివాస్, నటుడు సునీల్ కూడా తమ మూలాలను ఇప్పటికీ మర్చిపోలేదు. సునీల్, త్రివిక్రమ్ ఇద్దరూ ముందు నుండి మంచి స్నేహితులు. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఇద్దరూ ఒకేసారి అవకాశాల కోసం వెతకడం ప్రారంభించారు.

Advertisement

త్రివిక్రమ్ కథలు రాయడం, దర్శకత్వం వైపు అడుగులు వేయగా… సునీల్ సినిమాల్లో నటుడిగా పరిచయం అయ్యేందుకు ప్రయత్నించాడు. ఇక మొదట ఈ సినిమాల్లో సునీల్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో త్రివిక్రమ్ కు సాయం చేసే వారట. అదేవిధంగా త్రివిక్రమ్ దర్శకుడిగా ఎదిగిన తర్వాత సునీల్ కు అవకాశాలు ఇప్పించడం, ఇవ్వడం చేసేవారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇద్దరు కూడా ఇండస్ట్రీలో మంచి పొజిషన్ లో ఉన్నారు.

Advertisement

సునీల్ కామెడియన్ గా కెరీర్ ను మొదలు పెట్టి హీరోగా సైతం పలు చిత్రాలు చేశాడు. ఇక ఇప్పుడు విలన్ గానూ రాణిస్తున్నాడు. మరోవైపు త్రివిక్రమ్ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. అయితే సినిమా అవకాశాల కోసం వచ్చిన కొత్త లో సునీల్, త్రివిక్రమ్ పంజాగుట్ట లోని సాయి బాబా టెంపుల్ దగ్గర ఒక చిన్న గదిలో అద్దెకు ఉండేవారట.

ఆ సమయంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారట. అయితే ఇప్పటికీ సునీల్, త్రివిక్రమ్ ఆ రూమ్ రెంట్ కట్టడం విశేషం. ఇద్దరికీ సమయం దొరికినప్పుడు ఆ రూం కు వెళ్లి తమ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ అవకాశా కోసం ఎదురుచూస్తూ గడిపిన క్షణాలను తలుచుకుంటారు. ఈ విషయాన్ని సునీల్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

Also Read: బ్లాక్ బస్టర్ ‘అరుంధతి’ లాంటి సినిమా వదులుకున్న స్టార్ హీరోయిన్..ఎవరో తెలుసా ?

Visitors Are Also Reading