Home » జయలలిత రాజకీయ నాయకురాలు అవుతుందని తొలుత చెప్పిన హీరో ఎవరో మీకు తెలుసా?

జయలలిత రాజకీయ నాయకురాలు అవుతుందని తొలుత చెప్పిన హీరో ఎవరో మీకు తెలుసా?

by Anji
Published: Last Updated on
Ad

తమిళ ప్రజల ఆరాధ్య దైవంగా భావించే రాజకీయ నాయకురాలుగా జయలలిత అందరికీ పరిచయమే. అంతకు ముందు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 140 సినిమాల్లో నటించి సినీ రంగంలో కూడా ఈమె మంచి పేరు సంపాదించుకుంది. 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన జయలలిత మొత్తం 8 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించింది. 1991లో సీఎం పదవీ చేపట్టింది. ఫిబ్రవరి 24న జయలలిత జయంతి. ఈ సందర్భంగా ఆమె జీవితంలో జరిగిన ఓ ఆసక్తికరమైన సంఘటన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

హీరోయిన్ కొనసాగుతున్న సమయంలో రాజకీయాల పట్ల జయలలితకు అవగాహన లేదు. రాజకీయాల్లోకి వెళ్లాలనే  కోరిక లేదు. ఆ సమయంలోనే ఓ సంఘటన జరిగింది. జయలలిత రాకీయాల్లోకి వెళ్తుంది అని  నటుడు శోభన్ బాబు ఓ సందర్భంలో పేర్కొన్నారు. శోభన్ మాట ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే..? శోభన్ బాబు జయలలిత ఎంతో అభిమానంగా ఉండేవారట. అప్పట్లో జయలలిత ఓ కాస్ట్ లీ గిప్ట్ ని కూడా శోభన్ బాబుకి ఇచ్చిందట. రూ.25లక్షల విలువ చేసే డైమండ్ రింగ్.. అంతకు ముందే అప్పటి సీఎం ఎం.జీ.రామచంద్రన్ కి కూడా ఆమె ఇచ్చారు. శోభన్ బాబు, జయలలిత ఓ పందెం వేసుకున్నారట. నువ్వు నటీ కాకపోయి ఉంటే ఏమై ఉండే దానివి అని శోభన్ బాబు జయలలితను అడిగారు శోభన్ బాబు.  దానికి మీరు సమాధానం  చెప్పండి.. అని అడిగింది జయలలిత. ఏముంది అందరూ చెప్పినట్టుగానే యాక్టర్ కాకపోతే డాక్టర్ అయిఉండేదానివి అని చెబుతావు అన్నారు శోభన్ బాబు. అది కాదు.. వేరే ఉంది అని చెప్పింది. అంతకు మించి ఏమి ఉండదని వాదించారు. దీని కోసం వెయ్యి రూపాయలు పందెం అనుకున్నారట.

Advertisement

 

మూడు రోజులు గడిచిన తరువాత ఓ పుస్తకం తీసుకొచ్చారు జయలలిత. తాను మూడో తరగతి చదవుతున్న స్కూల్ సావనీర్ అది. అందులో తను రాసిన మాటలని చూపించింది. అది చూసి శోభన్ బాబు షాక్ అయ్యారు. నేను పెద్దయ్యాక రామ్ జెఠ్మలాని అంతటి పెద్ద పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవుతాను అని రాసి ఉంది. అది చదివిన తరువాత తాను ఓడిపోయానని ఒప్పుకున్నారు శోభన్ బాబు. ఇది తీసుకొచ్చి చూపించడానికే ఆ సమాధానం నా నోటి నుంచే చెప్పించావన్న మాట అంటూ సరదాగా అన్నారు. నీది పెద్ద రాజకీయమే.. భవిష్యత్ లో రాజకీయ నాయకురాలు అయ్యేంత తెలివి తేటలు నీకు ఉన్నాయి అని చెప్పారు శోభన్ బాబు. ఆయన అలా ఎందుకు అన్నారో తెలియదు.. కానీ అన్నట్టుగానే రాజకీయాల్లో చక్రం తిప్పి తమిళనాడు సీఎం అయిన విషయం తెలిసిందే.

Also Read :  వైర‌ల్ అవుతున్న బాల‌య్య వ‌సుంధ‌రల శుభ‌లేఖ‌…స్పెషాలిటీ ఏంటంటే..!

Visitors Are Also Reading