సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఒక హీరోతో అనుకున్న క్యారెక్టర్లు మరొక హరో చేయడం సర్వసాధారణం అయిపోయింది. కథ రాసుకునేటప్పుడు ఆ హీరోని దృష్టిలో పెట్టుకొని కథను రాసుకుంటాడు కథ రచయిత. కానీ ఆ హీరోకి ఉన్న కమిట్ మెంట్ లేక.. తదితర సమస్యలతో ఆ క్యారెక్టర్ మరో హీరో వద్దకు వెళ్తుంది. అలాంటి సమయంలో ఆ క్యారెక్టర్ కొన్ని మార్పులు చేర్పులు చేసి ఆ హీరో ఇమేజ్ కి తగ్గట్టు తెరకెక్కిస్తారు. అలా టాలీవుడ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన ఖడ్గం సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
Advertisement
ఈ సినిమాలో రవితేజ, శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్ ముగ్గురు లీడ్ క్యారెక్టర్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తొలుత శ్రీకాంత్ చేసే క్యారెక్టర్ కోసం తొలుత దర్శకుడు కృష్ణవంశీ నాగార్జున ని తీసుకోవాలనుకున్నాడట. అయితే నాగార్జున అప్పుడు ఆ క్యారెక్టర్ లో ఒకటి రెండు మార్పులు చేయాలని సూచించాడట. అయితే కృష్ణవంశీ ఆ క్యారెక్టర్ లో ఒక్క చేంజ్ కూడా చేయను అని చెప్పడంతో నాగార్జున ఆ క్యారెక్టర్ ని రిజెక్ట్ చేశాడట. తరువాత శ్రీకాంత్ తో కృష్ణవంశీ ఆ క్యారెక్టర్ ను చేయించి సినిమా సక్సెస్ సాధించాడు. ఈ సినిమాతో శ్రీకాంత్ క్రేజ్ భారీగా పెరిగిపోయిందనే చెప్పాలి.
Advertisement
వాస్తవానికి శ్రీకాంత్ పోషించిన పాత్ర చాలా సీరియస్ గా ఉంటుంది. ఆ పాత్రను చేయడం అంటే మామూలు విషయం కాదు. కానీ శ్రీకాంత్ చాలా అలవోకగా ఆ క్యారెక్టర్ లో దూరిపోయి నటించాడు. ప్రధానంగా సినిమా సక్సెస్ లో శ్రీకాంత్ కీలక పాత్ర పోషించాడనే చెప్పాలి. ఈ సినిమా తరువాత శ్రీకాంత్ కి చాలా అవకాశాలు వచ్చాయి. ఈ సినిమా దేశ భక్తి సినిమా గా కూడా అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించింది. ఈ సినిమాతో డైరెక్టర్ కృష్ణవంశీ కూడా మరోసారి తన మార్క్ మేకింగ్ తో సూపర్ హిట్ ని అందుకున్నాడు.
Also Read : పవన్ మూడో భార్య విడాకుల గురించి వేణు స్వామి ఏం చెప్పారో తెలుసా ?