Home » వీఐపీ, వివిఐపీలకి జైల్లో ఎలాంటి ట్రీట్మెంట్ లు ఉంటాయి? ప్రముఖులకు అలాంటి సౌకర్యాలు ఉంటాయా ?

వీఐపీ, వివిఐపీలకి జైల్లో ఎలాంటి ట్రీట్మెంట్ లు ఉంటాయి? ప్రముఖులకు అలాంటి సౌకర్యాలు ఉంటాయా ?

by Mounika
Ad

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఏపీ ప్రభుత్వం అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించింది. చంద్రబాబు ఇంటి నుంచి జైలుకు ఆహారం, మందులు తీసుకురావడానికి ఏసీబీ కోర్టు అనుమతించింది. ప్రత్యేక తరగతి కేటగిరీ కల్పించాలని జైళ్ల శాఖను ఆదేశించింది. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలను అరెస్టుచేసినప్పుడు జైల్లో ‘వీఐపీ’గా పరిగణిస్తారా..? మరి వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారో తెలుసుకుందాం.

Advertisement

1894లో దేశంలో జైళ్ల చట్టం అమల్లోకి వచ్చింది.ఆ తర్వాత వివిధ సందర్భాల్లో ఈ చట్టాన్ని సవరించారు. జైళ్ల శాఖ మాన్యువల్‌లో ఎక్కడా ‘వీఐపీ ఖైదీ’ ప్రస్తావన లేదని జైళ్ల శాఖ మాజీ ఐజీ సైదయ్య చెబుతున్నారు. ‘‘జైలు మాన్యువల్‌లో వీఐపీ ఎక్కడా లేదు. ఖైదీని అతని ఆర్థిక స్థితి, స్థోమత, జీవనశైలి మరియు హోదా ఆధారంగా ప్రత్యేక తరగతి ఖైదీగా పరిగణిస్తారు. అందుకు సంబంధిత వ్యక్తి ముందుగా కోర్టు నుంచి ప్రత్యేక అనుమతి పొందాలి.

Advertisement

కోర్టులోని వారిని ప్రత్యేక తరగతి కింద పరిగణిస్తే..  జైలులో ప్రత్యేక గది, బెడ్, రీడింగ్ టేబుల్, అల్మారా, ఏసీ, ఫ్రిజ్, టీవీ వంటి సౌకర్యాలు కల్పిస్తారు. అలాగే ఇంటి నుంచి సరుకులు తెచ్చి జైల్లో వండుకుని తినొచ్చు. జైలు తరపున వంట మనిషిని కూడా ఇస్తారు. లేదా కోర్టు అనుమతితో ఇంటి నుంచి ఆహారం తెచ్చుకోవచ్చు. జైళ్లలో సెలబ్రిటీల కోసం ప్రత్యేక బ్యారక్‌లు ఉంటాయి. వారికి ప్రత్యేక గదులు కేటాయించారు. ప్రత్యేక సదుపాయాలు కల్పించడం జైళ్ల శాఖ పరిధిలోని అంశం కాదని జైలు శాఖ అధికారులు తెలియజేస్తున్నారు

కోర్టు అనుమతితో మాత్రమే ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఆ గదులకు మరుగుదొడ్లు జోడించబడ్డాయి. బట్టలు ఉతకడానికి ప్రత్యేకంగా ఒక మనిషిని కూడా ఇస్తారని,  అయితే స్పెషల్ క్లాస్ ఎవరికీ ఇవ్వకపోవచ్చని జైలు అధికారులు చెబుతున్నారు. దాని ప్రకారం కోర్టు అడిగిన అన్ని రకాల డాక్యుమెంట్లను సమర్పించాలి. ఐటీ రిటర్న్స్‌తోపాటు వివిధ పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. కొంతమంది ప్రసిద్ధ లబ్రిటీల విషయంలో, న్యాయవాదుల అభ్యర్థన మేరకు ప్రత్యేక తరగతి కేటగిరీ కూడా ఇవ్వబడుతుంది.

Visitors Are Also Reading