పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, పాస్పోర్ట్ ఒక వ్యక్తి యొక్క గుర్తింపును తెలియజేస్తాయి. మనం ఏ పని చేయాలన్నా ఇవి తప్పనిసరి. బ్యాంకు లావాదేవీలు మొదలు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల వరకు అన్నింటికీ ఈ ఐడి కార్డు తప్పనిసరి అడుగుతారు. ఒకవేళ వీటిని పోగొట్టుకుంటే చాలా అనర్థాలు జరుగుతాయి. ఇవన్నీ పొందినటువంటి ఒక వ్యక్తి మరణిస్తే వీటి పరిస్థితి ఏమిటి.. అప్పుడు ఈ కార్డులు వినియోగంలో ఉంటాయా. ఒకవేళ వీటి అవసరం లేదు అనుకుంటే మనం ఏం చేయాలో తెలుసుకోండి.మరణించిన వ్యక్తి యొక్క ఐడి కార్డులను చాలా భద్రంగా ఉంచాలి. లేదంటే ఎవరైనా వీటితో అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంటుంది.
పాస్పోర్ట్ :
Advertisement
విదేశాలకు వెళ్లడానికి పాస్పోర్ట్ అనేది చాలా ముఖ్యం. ఇది లేకుండా ఏ దేశానికి వెళ్లలేరు. అటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి మరణించిన తర్వాత వారి పాస్పోర్ట్ ను రద్దు చేయాలని ఆలోచిస్తుంటే అది సాధ్యపడదు. ఆధార్ కార్డు లాగా పాస్పోర్ట్ ను రద్దు చేసే పద్ధతి ఇంకా రాలేదు. కానీ పాస్పోర్ట్ కు కాలపరిమితి అనేది ఉంటుంది. దీని తర్వాత దానిని పునరుద్ధరించు కోవాలి. ఒకవేళ దాన్ని పునరుద్ధరించు కాకపోతే ఎక్స్పైర్ అయిపోతుంది.
ఓటర్ గుర్తింపు కార్డు :
Advertisement
ఇండియాలో ప్రతి కార్డుకి ఒక ఉపయోగం ఉంటుంది. ఓటర్ ఐడి కార్డ్ అనేది ఒక ముఖ్యమైన పత్రం. భారత పౌరుడిగా ఉండటంతోపాటు, దీనితో ఎన్నికల్లో ఓటు వేయవచ్చు. ఎవరైనా మరణించిన తర్వాత దీన్ని రద్దు చేయవచ్చు. దీని కోసం ఎన్నికల కార్యాలయానికి వెళ్లి ఫారం 7 నింపాలి. తర్వాత కార్డు రద్దు చేస్తారు. దీన్ని రద్దు చేయాలంటే మరణ ధ్రువీకరణ పత్రం అవసరం.
పాన్ కార్డ్ :
ఆదాయపన్ను ఇలాంటి విషయాలలో ముఖ్యంగా ఉపయోగించేది పాన్ కార్డు. ఈ కార్డుదారులు మరణిస్తే దాన్ని రిటన్ చేయవచ్చు. మీ ఆదాయపన్ను ప్రక్రియ పూర్తికాని వరకు దానిని సురక్షితంగా ఉంచుకోవాలి. ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఈ పత్రాన్ని ఆదాయపు పన్ను శాఖకు అంద జేయవచ్చు. ఒకవేళ ఈ పాన్ కార్డ్ భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అంటే మీ దగ్గర ఉంచుకోవచ్చు.
also read:
- ఇండస్ట్రీ మొత్తం బ్రతిమిలాడిన వెంకటేష్ ఆ పని చేయడానికి ఒప్పుకోలేదట.. ఏంటంటే..?
- ఎంసెట్, ఈసెట్ అభ్యర్థులకు అలెర్ట్.. పరీక్ష షెడ్యూల్ విడుదల