Home » ఎంసెట్, ఈసెట్ అభ్య‌ర్థుల‌కు అలెర్ట్‌.. ప‌రీక్ష షెడ్యూల్ విడుద‌ల

ఎంసెట్, ఈసెట్ అభ్య‌ర్థుల‌కు అలెర్ట్‌.. ప‌రీక్ష షెడ్యూల్ విడుద‌ల

by Anji
Ad

ఇటీవ‌ల తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు కురిసిన విష‌యం విధిత‌మే. భారీ వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో కొంత మంది విద్యార్థులు ఎంసెట్, ఈసెట్‌ ప్రవేశ ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు కాలేర‌నే ఉద్దేశంతో ఎంసెట్‌, ఈసెట్ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేశారు. జులై 13, 14, 15 తేదీల్లో జ‌రగాల్సిన టీఎంసెట్ అగ్రిక‌ల్చ‌ర్‌, ఈసెట్ ప్ర‌వేశ ప‌రీక్ష‌లు వాయిదా పడిన సంగ‌తి తెలిసిందే. అయితే వాయిదా ప‌డిన ప‌రీక్ష‌ల షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్న‌త విద్యామండ‌లి తాజాగా విడుద‌ల చేసింది.

Advertisement

జులై 30, 31తేదీల్లో ఎంసెట్ అగ్రిక‌ల్చ‌ర్‌, ఆగ‌స్టు 01న ఈసెట్‌, ఆగస్టు 2 నుంచి 5 వ‌ర‌కు టీఎస్ పీజీఈసెట్ ప్ర‌వేశ‌ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్టు ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ లింబాద్రి వెల్ల‌డించారు. అభ్య‌ర్థులు త‌మ హాల్ టికెట్ల‌ను ఆయా వెబ్‌సైట్ల ఉంచి డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని సూచించారు. భారీ వ‌ర్షాల కార‌ణంగా మూడు రోజుల పాటు విద్యాసంస్థ‌లకు సెల‌వులు ప్ర‌క‌టించింది విద్యాశాఖ‌.

Advertisement

ఎంసెట్ అగ్రిక‌ల్చ‌ర్‌, ఈసెట్ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేసింది. మిగ‌తా ప‌రీక్ష‌లు య‌ధావిధిగా జ‌రిగాయి. ముఖ్యంగా జులై 14, 15 తేదీల్లో భారీ వ‌ర్షాలు ఉన్న‌ట్టు వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించ‌డంతో విద్యాసంస్థ‌లు సెల‌వుల‌ను సైతం మ‌రో మూడు రోజుల‌కు పొడిగించింది. దీంతో కొన్ని ప్రాంతాల విద్యార్థులు ఇబ్బంది ఎదుర్కోకుండా ఉన్నారు. వాయిదా ప‌డిన ప‌రీక్ష తేదీల‌ను తాజాగా రీ షెడ్యూల్ చేసింది.

Also Read : 

మల్టి స్టారర్ ఒకే అంటున్న చైతన్య.. కానీ అఖిల్ తో మాత్రం..?

ర‌మ్య‌కృష్ణతో విభేదాల‌పై నోరు విప్పిన కృష్ణ‌వంశీ.. ఏమ‌న్నారంటే..?

 

Visitors Are Also Reading