Home » ఇండస్ట్రీ మొత్తం బ్రతిమిలాడిన వెంకటేష్ ఆ పని చేయడానికి ఒప్పుకోలేదట.. ఏంటంటే..?

ఇండస్ట్రీ మొత్తం బ్రతిమిలాడిన వెంకటేష్ ఆ పని చేయడానికి ఒప్పుకోలేదట.. ఏంటంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఇండస్ట్రీని పాలించే సత్తా ఉన్నా,వారి కుటుంబ సభ్యులంతా స్టార్స్ అయినా కానీ, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని నైజం దగ్గుబాటి ఫ్యామిలీదీ.. వివాదాలకు దూరంగా ఉండే ఫ్యామిలీ ఏదైనా ఉంది అంటే మన ఇండస్ట్రీలో ముందుగా గుర్తుకు వచ్చేది దగ్గుబాటి ఫ్యామిలీనే. ఇందులో ముఖ్యంగా స్టార్ హీరోగా ఎదిగిన వెంకటేష్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉండి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న వెంకటేష్ ఇప్పటికీ స్టేజీపై ఎక్కాలంటే మొహమాట పడతారు. పెద్దగా బయట ప్రపంచానికి కలవరు. ఆయనకు ఎంత వరకు అవసరమో అంతవరకు మాత్రమే కనిపిస్తారు. ఇక సినిమాల విషయానికి వస్తే నిర్మాతలతో కానీ డైరెక్టర్లతో కానీ వెంకటేష్ చాలా పద్ధతిగా వ్యవహరిస్తారు.

Advertisement

Also Read: ఉదయ్ కిరణ్ ని చిరు ఫామిలీ లో కలుపుకుందాం అనుకున్నారు కానీ చివరికి..!

ఎప్పుడు ఏం మాట్లాడాలి.. ఎలాంటి సమయంలో తగ్గిపోవాలి. సమయస్ఫూర్తితో తను వచ్చిన పని ముగించుకొని కామ్ గా వెళ్లిపోతుంటారు వెంకటేష్. అలాంటి వెంకటేష్ గురించి ఎవ్వరికి తెలియని కొన్ని విషయాలను నిర్మాత మురళీమోహన్ ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అవేంటో చూద్దాం. వెంకటేష్ కు మొహమాటం ఎక్కువగా ఉంటుందని , మా అసోసియేషన్ ఏర్పడినప్పటి నుంచి దానికి అధ్యక్షుడిగా హీరోలనే ఉంచాలని అందరూ భావించి నిర్ణయం తీసుకున్నారట. ఎందుకంటే ఏ పని జరగాలన్న హీరోలు ఉంటే తొందరగా జరుగుతుందని వారు ఆ నిర్ణయం తీసుకున్నారట. కమెడియన్లు లేదా క్యారెక్టర్ ఆర్టిస్టులు చిన్న చిన్న వేషాలు వేసుకునే వారిని ఉంచితే పనులు స్పీడ్ గా జరగవని వారి మాటలను స్టార్ హీరోలు వినరని అన్నారు.

Advertisement

అదే హీరోలను ఉంచితే వారికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుందని, వారి మాట ఇష్టపడడానికి చాలామంది ఉంటారని అందుకే మా అసోసియేషన్ అధ్యక్షుడిగా హీరోలనే కొనసాగించే విషయం బయటపెట్టారు. ఇప్పటికే ఇండస్ట్రీలో మోహన్ బాబు, చిరంజీవి, నాగార్జున లాంటి వారు అధ్యక్ష పదవిని చేపట్టారు. కానీ ఒకానొక సమయంలో హీరో వెంకటేష్ మ అధ్యక్ష పదవిని చేపట్టమని అడిగితే ఆయన సున్నితంగా తిరస్కరించాడట. మా అసోసియేషన్ మొత్తం వెళ్లి బ్రతిమిలాడిన వారు దాని గురించి నాకు పెద్దగా తెలియదని అన్నారట వెంకటేష్. చివరికి అందరూ బలవంతం చేయడంతో ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడిగా ఉంటానని ఒప్పుకున్నాడట. ఒకసారి ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడైన వెంకటేష్ ఇప్పటికి కూడా అధ్యక్ష పదవి చేపట్ట లేదని, దీన్ని బట్టి చూస్తే ఆయన సున్నిత మనస్తత్వం ఎలాంటిదో మీరు అర్థం చేసుకోవాలని మురళీమోహన్ అన్నారు. ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వెంకటేష్ అభిమానులు చాలా ఆనంద పడుతున్నారు.

ALSO READ:

Visitors Are Also Reading