Home » ఆరెంజ్ చిత్రంలో నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

ఆరెంజ్ చిత్రంలో నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

by Bunty
Ad

మెగా హీరో రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. వరుస సినిమాలు చేసుకుంటూ యూత్ ని తెగ ఆకట్టుకున్నాడు రామ్ చరణ్. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకొని పాన్ ఇండియన్ స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే రామ్ చరణ్ కెరీర్ ప్రారంభంలో హిట్స్ తో పాటు ఫ్లాప్స్ ని కూడా చూశాడు. తన కెరీర్ లోనే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఆరెంజ్.

Advertisement

ఈ సినిమా అప్పట్లో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ రీ రిలీజ్ లో మాత్రం ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జెనీలియా, షాజన్ పదమ్సీ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో జెనీలియా తన అల్లరి, చలాకీతనంతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించిన షాజన్ పదమ్సీ ఆ సినిమా ద్వారా తెగ పాపులర్ అయిపోయింది. ఈ సినిమాలో ముఖ్యంగా రూబా రూబా పాటతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తెగ పాపులర్ అయిపోయింది షాజన్ పదమ్సీ. “రాకెట్ సింగ్ : సేల్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్” అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా అనంతరం వరుసగా సినిమా అవకాశాలు అందుకుంది.

షాజన్ తెలుగులో ఆరెంజ్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ సినిమా తర్వాత మసాలా సినిమాలో అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఈ రెండు సినిమాల అనంతరం తాను తెలుగులో మరే సినిమాలోనూ కనిపించలేదు. రీసెంట్గా ఈ అమ్మడు హిందీలో పాగల్ పన్ నెక్స్ట్ లెవెల్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది షాజన్ పదమ్సీ సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటుంది. వరస ఫోటోషూట్లు, గ్లామర్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను పిచ్చెక్కిస్తుంటుంది ఈ అమ్మడు.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి

Visitors Are Also Reading