మిస్ యూనివర్స్ పోటీలకు ఎంతో ఆధారన ఎక్కువ గానే ఉంటుంది. ఈ మిస్ యూనివర్స్ కిరీటం కోసం చాలా మంది యువతులు పోటీ పడుతూ ఉంటారు. దాని కోసం ఏళ్ల తరబడి ప్రత్యేకం గా ట్రేన్ అయి ఉంటారు. నిష్ణతుల నుంచి కూడా సలహాలు తీసుకుంటారు. నిజానికి మిస్ యూనివర్స్ పోటీలలో కిరిటం అందం ఉన్న వాళ్లకే కాకుండా జ్ఞానం ఉన్న వాళ్లే కే ఎక్కువ వరించే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఏడాది కి సంబంధించి భారత్ నుంచి చాలా ఏళ్ల తర్వాత విశ్వ సుందరి గా నిలిచింది. పంజాబ్ కు చెందిన హర్నాజ్ సంధు ఈ ఏడాది విశ్వ సుందరి కిరిటాన్ని గెలుచుకుంది. అయితే హర్నాజ్ సంధు విశ్వ సుందరి గా గెలిచిన తర్వాత ఎంత ఫ్రైజ్ మనీ ఉంటుంది.. వారికి ఎలాంటి సౌకర్యాలు ఉంటాయనే చర్చ ప్రస్తుతం ఎక్కువ నడుస్తుంది. అయితే ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం.
Advertisement
ముందుగా విశ్వ సుందరి గా గెలిచిన వారికి ఒక కిరీటం ఇస్తారు. అయితే ఆ కిరీటం ఎంత విలువ అయిందో తెలుసా.. ఈ కిరీటాన్ని ది పవర్ ఆఫ్ యూనిటీ గా పిలుస్తారు. దీనికి సుమారు 18 క్యారెట్ల బంగారం తో ఉంటుంది. అలాగే 1725 తెలుపు వజ్రాలు, 3 గోల్డెన్ కెనరీ డైమండ్స్ ఈ కిరీటం లో ఉంటాయి.
Advertisement
అలాగే ఈ కిరీటం మధ్య లో బంగారపు షీల్డ్ తో రూపొందించిన డైమండ్ ఉంటుంది. దీని బరువు దాదాపు 62.83 క్యారట్లు ఉంటుంది. మొత్తం గా కిరీటం విలువ మన కరెన్సీ లో రూ. 38 కోట్ల వరకు ఉంటుంది. అయితే ఈ కిరీటాన్ని ఎవరికీ కూడా పూర్తి గా ఇవ్వరు.
1) మిస్ యూనివర్స్ గా గెలిచిన వారికి రూ. 1.8 కోట్ల ఫ్రైజ్ మనీ అందిస్తారు.
2) మిస్ యూనివర్స్ కు న్యూయర్క్ నగరంలో మిస్ యూనివర్స్ అపార్ట్ మెంట్స్ లో ఏడాది పాటు ఉచిత నివాస సౌకర్యం ఉంటుంది.
3) విశ్వ సుందరి కి ప్రత్యేకం గా మేకప్ బృందాన్ని కేటాయిస్తారు. మేకప్ సామాగ్రీని కూడా ఏడాది పాటు ఉచితం గా అందిస్తారు.
4) మిస్ యూనివర్స్ మోడలింగ్ చేయాలనుకుంటే వారికి ప్రత్యేకం గా ఫోటో గ్రాఫర్ లను కూడా నియమిస్తారు.
5) మంచి జీతం కూడా ఇస్తారనే ప్రచారం ఉంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు.
6) మిస్ యూనివర్స్ కు ఏడాది పాటు ప్రయాణం, హోటల్, రెస్టారెంట్ల ఖర్చు లు కూడా మొత్తం ఆర్గనైజేషనే భరిస్తుంది.