Home » హీరో వెంకటేష్ కూతుర్లు ఏం చేస్తుంటారో తెలుసా…?

హీరో వెంకటేష్ కూతుర్లు ఏం చేస్తుంటారో తెలుసా…?

by Bunty
Published: Last Updated on
Ad

విక్టరీ వెంకటేష్ ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. అతిచిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు. దాదాపు ఇప్పటివరకు 70కి పైగా చిత్రాల్లో హీరోగా నటించి ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతోమంది అమ్మాయిలను స్టార్ హీరోయిన్లుగా పరిచయం చేశాడు. 60 పదుల వయసు దాటినా కూడా ఇప్పటికీ కుర్ర హీరోలకు గట్టి పోటీని ఇస్తూ సినిమాలు చేస్తున్నాడు.

daggubati-Venkatesh-Daughters-Profession

daggubati-Venkatesh-Daughters-Profession

వెంకటేష్ వయసు పెరిగినా కూడా ఏమాత్రం చెదరకుండా తన గ్లామర్ ని మెయింటైన్ చేస్తున్నాడు. ఫిట్నెస్ కూడా అదే రేంజ్ లో మెయింటైన్ చేస్తూ ఇప్పటికి యంగ్ గానే కనిపిస్తూ ఉంటాడు. ఇక వెంకటేష్ పర్సనల్ విషయానికి వస్తే…. తన కుటుంబానికి సంబంధించిన విషయాలను చాలా సీక్రెట్ గా ఉంచుతారు. వెంకటేష్ సినిమాలో నటిస్తున్న సమయంలోనే 1985 సంవత్సరంలో నీరజ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరికి నలుగురు పిల్లలు. ముగ్గురు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నాడు. వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత. ఆశ్రితకి వివాహమైంది.

Advertisement

తన భర్తతో కలిసి రెస్టారెంట్ వ్యవహారాలను చూసుకుంటుంది. అంతేకాకుండా యూట్యూబ్ ఛానల్ ని కూడా రన్ చేస్తూ ఉంటుంది ఆశ్రిత. ఇక వెంకటేష్ రెండవ కూతురు హాయవాహినికి రీసెంట్ గానే ఎంగేజ్మెంట్ జరిగింది. హయవాహిని ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ పూర్తిచేసింది. ఇక వెంకటేష్ మూడవ కూతురు భావన చదువు పూర్తిచేసుకుని క్రీడారంగం వైపుకు వెళుతుంది. ఇక వెంకటేష్ కుమారుడు అర్జున్ తన చదువును కొనసాగిస్తున్నాడు. ఇక వెంకటేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి

Visitors Are Also Reading