సోనూసూద్ గురించి ప్రస్తుతం తెలియని వారుండరు. ముఖ్యంగా కరోనా సమయంలో సోనూసూద్ సంపాదించుకున్న స్టార్‌డమ్ ఇమేజ్ అంతా ఇంతా కాదు. ప్రజలు దేవుళ్లు అని కొన్ని చోట్ల సోనూసూద్ విగ్రహం కూడా ఏర్పాటు చేసారంటే ఆయన చేసిన మేలు ఏమిటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా.. కొంతకాలం నుంచి భారత చిత్ర సీమలో సౌత్ వర్సెస్ నార్త్ పోరు జరుగుతున్న విషయం తెలిసినదే. ఈ తరుణంలోనే స్టార్స్‌కు ఆ విషయంపై తరుచూ ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
నటుడు సోనూసూద్‌కి కూడా సౌత్ వర్సెస్ నార్త్ అంశంపై ప్రశ్నలు ఎదరవ్వగా.. తాజాగా అతడు స్పందించాడు. హిందీ చిత్రాలను కాదనుకొని, దక్షిణాది చిత్రాలను అంగీకరించడంపై నాకు తరుచూ ప్రశ్నలు ఎదురయ్యేవి అయితే.. నేను ఏం చేస్తున్నానన్న విషయంపై మాత్రం నాకు పూర్తి అవగాహన ఉంది. నేను ఏ భాషలో సినిమాలు చేసినా.. స్క్రిప్ట్‌ను బట్టి జాగ్రత్తగా ఎంచుకుంటారు. నాకు నచ్చని హిందీ సినిమాలను చేయకుండా దక్షిణాది పరిశ్రమే నన్ను రక్షించిందని సోనూసూద్ చెప్పుకొచ్చాడు.
Advertisement
Advertisement
ఒకానొక సమయంలో పెద్ద సినిమాల్లో కనిపించడం కోసం సినిమాలు చేస్తున్నామన్న దశ వచ్చిందని అలాంటి పరిస్థితి నుంచి దక్షిణాది సినిమాలే తనను బయట పడేశాయని సోనూసూద్ వెల్లడించాడు. ఈ రంగంలో ఉన్నప్పుడు ప్రజలకు వినోదం పంచాలి అని తాను విజయవంతం అయినా నటుడిని ప్రేక్షకులను తేలికగా తీసుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇక కరోనా మహమ్మారి తరువాత అన్ని పాజిటివ్ పాత్రలే వస్తున్నాయని చెప్పాడు సోను. తనను నెగిటివ్ పాత్రలో చూపించడానికి నిర్మాతలు వెనుకాడుతున్నారని వెల్లడించాడు. తన జీవితంలో మరొక దశ అని, తనకు ఒక కొత్త ఇన్నింగ్స్ అని సోనూసూద్ చెప్పాడు. ప్రస్తుతం చాలా సినిమాలతో బిజీగా ఉన్న సోనూసూద్ అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన పృథ్వీరాజ్‌లో చాంద్ బర్దాయ్ పాత్రలో కనిపించనున్నాడు.
Also Read :
నా పేరు ముఖేష్ అనే యాడ్ చేసిన.. యువకుడి గురించి ఈ విషయాలు తెలిస్తే కన్నీళ్ళు పెడతారు..?
రైలు బోగీలు రెడ్, బ్లూ, గ్రీన్ కలర్‌లోనే ఎందుకు ఉంటాయో తెలుసా..?