సౌత్ ఇండియాలో రెండు దశాబ్దా క్రితం ఇండస్ట్రీలో షకీలా తన సినిమాలలో నటించారు. మళయాళంలో ఆమె నటించిన సినిమాలు సౌత్ ఇండియాలో అన్నీ భాషల్లోనూ విడుదలయ్యాయి. ఆ సమయంలోనే ఆమెకు తిరుగులేని క్రేజ్ వచ్చింది. అయితే ఆమె నటించిన సినిమాలు హిందీ భాషల్లో కూడా డబ్బింగ్ చేసేవారు. అప్పట్లో ఆమె నటించిన సినిమాలు వారకొకటి చొప్పున విడుదలయ్యేవి. అయితే షకీలాకు స్టార్ హీరోలు కూడా టార్గెట్ చేశారు.
Advertisement
అయితే షకీలా సినిమాలపై నిషేదం విధించడంతో పాటు ఆమె సినిమాలు విడుదల కాకుండా పెద్ద హీరోలు సైతం అడ్డుపడిన సంఘటనలున్నాయి. దీనిని బట్టీ ఆమెకు ఎలాంటి క్రేజ్ వచ్చిందో అర్థమవుతుంది. ఆమె నటించిన కొన్ని సినిమాలు విదేశీ భాషల్లోకి కూడా డబ్ అయ్యాయి. 2003 తరువాత ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ క్యారెక్టర్ ఆర్టీస్ట్‌గా మారిపోయారు. రెండు దశాబ్దాల పాటు ఆమె నటీగా బిజీగా ఉన్నారు. షకీలా పలు పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
Advertisement
ఆమె తన కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కున్నారట. షకీలా జీవిత చరిత్ర ఆధారంగా షకీలా పేరుతో తెరకెక్కిన సినిమా కూడా గత సంవత్సరం విడుదల విషయం తెలిసిందే. భారీ అంచెనాలతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఇంద్రజిత్ లంకేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించింది. షకీలా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చాలా మందిని గుడ్డిగా నమ్మి మోసపోయాను అని, తన దగ్గరకు వచ్చిన సినిమా దర్శకులు, బంధువులు కానీ నమ్మదగిన వారు కాదు అని వాపోయారు. బంధువులు ఆర్థిక సాయం పొందిన తరువాత మోసం చేశారని పేర్కొంది. దర్శకుడు ఇంద్రజిత్ సినిమాకు ముందు తనను కలిసి చాలా విషయాల గురించి చర్చించారని, ఆ తరువాత ఆయన కథను తన ఇష్టానుసారంగా మార్చేసాడని కామెంట్ చేసింది. ప్రస్తుతం ఓ కన్నడ సినిమాలో నటిస్తున్నాను అని, తెలుగులో ఆఫర్లు రావడం లేదని చెప్పుకొచ్చింది. ఆమె ఎన్ని సినిమాలలో నటించినా.. ఆర్థికంగా మాత్రం స్థిరపడలేదు.