Home » మైదా పిండి దేని నుంచి త‌యారు చేస్తారో తెలుసా?

మైదా పిండి దేని నుంచి త‌యారు చేస్తారో తెలుసా?

by Bunty

సాధార‌ణంగా మైదా పిండి, గోధుమ పిండి రెండు కూడా ఒకే ర‌కంగా ఉంటాయి. కానీ మైదా పిండి కాస్త తెల్ల‌గా ఉండి మెత్త గా ఉంటుంది. అందు వ‌ల్ల మైదా పిండిని సులువు గా గుర్తిస్తారు. అయితే మ‌నం సాధారణం గా ఏ యే పిండి దేని నుంచి తయారు చేస్తారో తెలుసు. శన‌గ పిండి శ‌న‌గల నుంచి, బియ్యపు పిండి ని బియ్యం నుంచి అలాగే గోధుమ పిండిని గోధుమల నుంచి తయారు చేస్తారు. అయితే అయితే మైదా పిండిని దేని నుంచి త‌యారు చేస్తారో అని చాలా మందికి తెలియ‌దు.

అయితే మైదా పిండిని దేని నుంచి తయారు చేస్తారో.. దాని త‌యారి ప్రాసెస్ ఎలా ఉంటుంది.. మైదా పిండి గురించి కూడా తెలుసుకుందాం. మైదా పిండి, గోధుమ పిండి రెండు ఒకే వ‌ర్గానికి చెందిన‌వి. అంటే రెండు కూడా గోధుమల నుంచే త‌యారు చేస్తారు. అయితే గోధుమ‌లను పాలిష్ చేసి మిల్లు లో పిండి గా చేస్తారు. దాన్ని గోధుమ పిండి అని అంటారు. అలా వ‌చ్చిన గోధుమ పిండి నుంచే మైదా పిండి ని త‌యారు చేస్తారు. గోధుమ పిండి లో అజో బై కార్బొన‌మైడ్, క్లోరిన్ గ్యాస్, బెంజోయిల్ పెరాక్స‌యిడ వంటి ర‌సాయ‌నాల‌ను క‌లుపుతారు.

ఇలా క‌ల‌ప‌డం వ‌ల్ల గోధుమ పిండి తెల్ల‌గా.. మెత్త గా మారి మైదా పిండి గా రూపాంతరం చెందుతుంది. అయితే మైదా పిండి కోసం వాడే ఆ మూడు ర‌సాయనాల‌ను చాలా దేశాల్లో నిషేధించారు. అలాగే చాలా దేశాల్లో మైదా పిండి త‌యారిని కూడా నిషేధించారు. కానీ మ‌న ద‌క్షిణాది రాష్ట్రాల‌లో మైదా పిండిని ఎక్కువ గా వాడుతుంటారు. అయితే మైదా పిండి ని ఎక్కువ తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ఆనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని డాక్ట‌ర్లు చెబుతారు.

Visitors Are Also Reading