Home » ఫ్రెండ్ షిప్ డే గురించి హీరోయిన్ కీర్తి సురేష్ ఏమన్నారో తెలుసా ?

ఫ్రెండ్ షిప్ డే గురించి హీరోయిన్ కీర్తి సురేష్ ఏమన్నారో తెలుసా ?

by Anji
Ad

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కి ఈ ఏడాది చాలా బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. తాను నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ అందుకొని దూసుకెళ్లింది. మార్చిలో రిలీజైన దసరా మూవీతో పాటు జులై లో విడుదలైన నాయకుడు మూవీలతో తన ఖాతాలో వరుస విజయాలను వేసుకున్నారు. ఇక ఇదే జోరును కొనసాగిస్తున్న కీర్తి.. కొద్ది రోజుల్లోనే చిరంజీవి చెల్లెలుగా నటించిన భోళా శంకర్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Advertisement

తాజాగా కీర్తి సురేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. “సూపర్ స్టార్ రజినీకాంత్ అణ్ణాత్తే  సినిమా చేస్తున్న సమయంలో నాకు భోళాశంకర్ లో పని చేసే అవకాశం వచ్చింది. చిరంజీవికి చెల్లిగా నటిస్తున్నాను అనగానే నాకు సంతోషం అనిపించింది. ఇక అదే సమయంలో ఆయనతో నాకు డ్యాన్స్ చేసే అవకాశం ఉంటుందో లేదో అని కాస్త భయంగాను అనిపించింది. కానీ అదృష్ట వశాత్తు ఇందులో నేను ఆయనతో రెండు పాటలకు డ్యాన్స్ చేయగలిగాను. అన్నా చెల్లెలు అనుబంధాల చుట్టూ అల్లుకున్న కథతో రూపొందిన సినిమా ఇది. యాక్షన్.. కామెడీ అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు.. ఇందులో చాలా మంది స్టార్లు కనిపిస్తారు. 

Advertisement

ఈ సినిమాలో నేను చిరంజీవి చెల్లిగా నటించిన సెట్ లో ఆయనను ఎప్పుడూ చిరు గారు అనే పిలిచేదానిని. మా అమ్మ చిరంజీవి సార్ తో పున్నమినాగు మూవీలో కలిసి నటించారు.  అప్పటికీ తనకు 16 సంవత్సరాల వయస్సు మాత్రమే. అయితే  తనను ఆయన ఓ చిన్న పిల్లలా ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారట. ప్రతీ విషయాన్ని తనకు ఎంతో ఓపికగా నేర్పించేవారట. అమ్మ చెప్పిన ఈ విషయాలు చిరంజీవితో చెప్పాను. ఆయన చాలా సంతోషపడ్డారు. ఈ మూవీ షూటింగ్ జరిగినన్నీ రోజులు నాకు చిరంజీవి ఇంటి నుంచే భోజనం తెప్పించేవారు. ఇక నాకు స్నేహితులు ఎక్కువ మంది ఉన్నారు. నా ఎదుగుదలలో వారి ప్రోత్సాహం, సహకారం చాలానే ఉంది. సమయం దొరికినప్పుడల్లా వారితో గడిపేందుకు ఇష్టపడతాను.నాకు బ్రదర్ లాంటి ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు. భోళాశంకర్ వల్ల చిరంజీవితో మంచి స్నేహబంధం ఏర్పడింది. ఆయన మా అమ్మకి మంచి స్నేహితుడే. ఇప్పుడు ఆయనకు నేను కొత్త ఫ్రెండ్. ఫ్రెండ్ షిప్ డే అనేది ప్రత్యేకంగా జరుపుకోవడం తెలియదు. ఎందుకంటే ఏడాది మొత్తం మేము వేడుక చేసుకుంటూనేఉంటాం. నా వరకు ప్రతీ రోజు ఫ్రెండ్ షిప్ డే నే” అని చెప్పుకొచ్చింది కీర్తి సురేష్.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

Chanakya Niti : నిజమైన స్నేహితుడిని ఇలా గుర్తించండి.. మీరు ఎప్పటికీ మోసపోరు..!

 కెరీర్ పీక్స్ లో ఉండగానే ఈ తారలు ఎలా మరణించారో తెలుసా…?

Visitors Are Also Reading