సాధారణం గా భూమి పైనే ఎవరైన చనిపోతే ఖననం చేస్తారు. మృత దేహాన్ని భూమి లో పాతి పెడితే భూమి లో ఉండే బ్యాక్టిరియా, సూక్షజీవులు దశల వారీగా కుళ్లిపోయేలా చేస్తుంది. అయితే ఎవరైనా స్పెస్ లో చనిపోతే ఏం జరుగుతుందని ఎప్పుడు అయినా ఆలోచించారా..? ఈ మధ్య కాలంలో అంతరిక్ష విహార యాత్రలు అంటు కొత్త గా వస్తున్నాయి. అమెరికాలో ఇప్పటికే పలువురు బిలియనీర్లు అంతరిక్ష విహార యాత్రలకు వెళ్లి వచ్చారు. కొన్ని సంవత్సరాల తర్వాత అంతరిక్ష యానం సామాన్యులకు కూడా అందుబాటు లో ఉంటుందని చెబుతున్నారు. అయితే అంతరిక్షానికి వెళ్లిన తర్వాత అక్కడ మరణిస్తే మృత దేహం ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
Advertisement
అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. స్పెస్ లో ఉన్న ఉష్ణోగ్రతలను బట్టి మృతదేహంలో మార్పులు వస్తాయి అని అంతరిక్ష శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇతర గ్రహాలల్లో గురుత్వాకర్షణశక్తి విషయం లో అనేక తేడాలు ఉంటాయి. దీంతో లివోర్ మోర్టిన్ దశ పై ప్రభావం ఉంటుంది. గురుత్వాకర్షణశక్తి లేక పోతే డెడ్ బాడీ లోని రక్తం పోగుపడదు. అలాగే చనిపోయిన వ్యక్తి స్పేస్ సూట్ వేసుకున్నా సరే పేగులోన్ బ్యాక్టీరియా మృత కణజాలం వెళ్తుంది. ఈ బ్యాక్టీరియా పని చేయడానికి ఆక్సిజన్ అవసరం. అయితే స్పెస్ లో ఆక్సిజన్ స్థాయి తక్కువ గానే ఉంటుంది.
కాబట్టి ఈ ప్రక్రియ నెమ్మదిగా సాగుతుంది. అలాగే చంద్రుడిపై ఉష్ణోగ్రతలు 120 డిగ్రీల నుంచి 170 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయి. అయితే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న సమయంలో మృతదేహం పై జరిగే ప్రక్రియ కూడా జరుగుతుంది. డెడ్ బాడీ లో కర్బన పదార్థాలు కుళ్లిపోతాయి. అకర్బన పదార్థాలు అస్థిపంజరాలగా మిగిలిపోతాయి. కానీ స్పెస్ లో తీవ్ర ఆమ్లత్వం తో కూడిన పరిస్థితుల్లో కుల్లి పోవడం అనేది కాస్త నెమ్మదిగా జరుగుతుంది.