మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈమె మహారాష్ట్రలోని ధూలెలో జన్మించింది. కళాశాల రోజుల్లోనే బుల్లితెరపై అడుగుపెట్టింది. సీరియల్స్ ద్వారా ఈమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ తరువాత 2014లో మరాఠీ చిత్రం విట్టిదండు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించినా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది.
Advertisement
2018 బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ ‘సూపర్ 30’ లో హృతిక్ రోషన్ సరసన నటించి విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఆ తరువాత ఘోస్ట్ స్టోరీస్, ధమాకా, జెర్సీ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. 2022లో తెలుగులో విడుదలైన సీతారామం చిత్రంతో మృణాల్ ఠాకూర్ క్రేజ్ ను అమాంతం పెంచేసింది. తెలుగుతో పాటు అన్ని భాషల్లో విడుదలైన ఈ చిత్రం మృణాల్ కి దేశవ్యాప్తంగా సూపర్బ్ క్రేజ్ తెచ్చిపెట్టింది.
Advertisement
ఈ సినిమాకి ప్రముఖులతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందాయి. బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఇప్పుడు హిందీ 5 చిత్రాలు, తెలుగులో నాని సరసన ఓ సినిమాలో నటిస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలోనే ఓ అభిమాని మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నా వైపు నుంచి ఓకే అంటూ అతను కామెంట్ చేశాడు. దీనికి రిప్లై గా మృణాల్ మాత్రం నా వైపు నుంచి ఓకే కాదుగా అని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read : ఎన్టీఆర్ ను కావాలనే పక్కన పెట్టారా….? పూర్తి క్లారిటీ ఇదే…!