మహాభారత కాలంలో శ్రీ కృష్ణుడు పాలించిన ఈ ద్వారక సముద్రం అడుగున ఉంది అని అంటారు. భారతీయ ఇతిహాసాలకు బలాన్ని చేకూర్చే ఆనవాళ్ళు ఇంకా అలాగే ఉన్నాయి. మరి శ్రీకృష్ణుడు పాలించిన ఈ ద్వారకా నగరానికి ఏమైంది. సముద్రంలో ఎందుకు మునిగింది. అప్పుడు ఏం జరిగిందో తెలుసు కుందాం. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే నగరాల్లో ద్వారక ఒకటి. మిగిలిన మూడు పవిత్రనగరాలు బద్రీనాథ్,పూరి, రామేశ్వరం ద్వారక అనగానే అనేక ద్వారాలు కలదని అర్థం చేసుకోవచ్చు. వేదవ్యాసుడు రాసిన మహాభారత కావ్యంలో ద్వారకా నగరాన్ని ద్వారావతి గా చెప్పారు.\
Advertisement
ఇది గుజరాత్ లోని పశ్చిమ తీరంలో ఉన్నది. శ్రీకృష్ణుడు మగదలో కంసుని సంహరించడం వలన మగధ రాజు దండయాత్ర చేశారు. దీంతో శ్రీకృష్ణుడు తనతో ఉన్నటువంటి యాదవులను ద్వారకా నగరానికి పంపారు. తర్వాత సముద్ర గర్భంలోని దీవుల సమూహం అన్ని కలిపి అద్భుతమైన ద్వారకా నగరాన్ని నిర్మించారు. హరి వంశ పురాణం మహాభారతం వాయు పురాణం, భాగవతం, కంద పురాణంలో ద్వారక క్షేత్రం వాటికి సంబంధించినటువంటి ప్రస్తావన ఉన్నది. శ్రీకృష్ణుడుతో పాటు మిగిలిన రాజులు కూడా ద్వారకా నగరాన్ని కేంద్రంగా చేసుకుని పాలించారు.
Advertisement
కురుక్షేత్ర యుద్ధం జరిగిన 16 సంవత్సరాల తర్వాత ఈ నగరం సముద్రగర్భంలో కలిసి పోయింది. అయితే మహాభారత యుద్ధం క్రీస్తుపూర్వం 3138 లో జరిగింది. ఆ తర్వాత 36 సంవత్సరాలు శ్రీకృష్ణుడు ద్వారక లో నివసించాడు. కృష్ణుని తరువాత యాదవ రాజులు పరస్పరం వారిలో వారే గొడవలు పడి సామ్రాజ్యం పతనం అయింది. యాదవ కులం కూడా వారిలో వారే కొట్టుకొని చస్తారు అని గాంధారి శపించింది. ఆ తర్వాత కృష్ణుడు అరణ్యాలకు వెళ్ళాడు.. అక్కడి నుంచి నేరుగా స్వర్గానికి వెళ్లాడని మహాభారతంలో ఉంది.
ALSO READ;
మజ్జిగ గురించి మీరు తెలుసుకోవాల్సిన టాప్ సీక్రెట్స్.. ఏంటో చూడండి..!!
చీపురు వారంలో ఈ రోజు కొంటే ఇంట్లో కనకవర్షమే.. ఏంటో చూడండి..!!